మనిషికి రూ 500 ,పెట్రోల్ కి రూ 200..సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న కౌశల్ ఆర్మీ 2 కే రన్ వీడియో..

Kaushal Army Fake Video

Kaushal Army Fake Video

తెలుగు బిగ్ బాస్ షో నటుడు కౌశల్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెల్సిందే,ఇక కౌశల్ ఆర్మీ పేరుతొ సోషల్ మీడియా లో భారీ రచ్చ చేస్తున్న ఆయన అభిమానులు ఈమధ్య తరచుగా కౌశల్ కి మద్దతుగా రోడ్డు పై ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు..

ఈమధ్యన ఆయన అభిమానులు విజయవాడ,హైదరాబాద్ లో 2 కే రన్ నిర్వహించిన సంగతి తెల్సిందే..అయితే కౌశల్ కి నిజానికి ఎటువంటి క్రేజ్ లేదని, కేవలం ఆర్మీ పేరుతొ కొంత మంది అయన అభిమానులు చేస్తున్నవి అన్నీ డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

ఈ ర్యాలీ లో పాల్గొన్న ఒక యువకుడు 2 రోజుల క్రితం విజయవాడ లో జరిగిన 2కే రన్ లో ఒక యువకుడు రహస్యంగా తీసిన వీడియో ఈ ఆరోపణలపై బలం చేకూర్చేలా ఉంది..

ఈ వీడియో లో ఆ యువకుడు మరొక యువకుడు ప్రశ్నిస్తూ ఈ ర్యాలీ లో పాల్గొన్నందుకు నీకు ఎంత ఇస్తారు అని ప్రశ్నించగా? “నాకు ఏమి ఇవ్వలేదు,అయితే పెట్రోల్ కోసం రూ 200 ఇచ్చారు,వెళ్ళేటప్పుడు మరొక రూ 200 తో పెట్రోల్ కొట్టిస్తారు”.. అని బదులు ఇచ్చాడు,మరొక యువకుడు ఒకడుగు ముందుకేసి,నాకు రూ 500 ఇచ్చారు అని సమాధానమిచ్చి షాక్ ఇచ్చాడు..

ఇక ర్యాలీ లో పాల్గున్న సమయంలో కౌశల్ ఆర్మీ ఈ ర్యాలీ ద్వారా తమకి కౌశల్ పట్ల ఉన్న నిజమైన అభిమానం అని నిరూపితమైంది అని వ్యాఖ్యానించగా,గతవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఆర్ జె గణేష్ మాత్రం “మీకే తెలియాలి ఇలాంటివి నేను ఎక్కడా వినలేదు “అంటూ వ్యాఖ్యానించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed