నటి వనిత విజయ్ కుమార్ అరెస్ట్,సొంత తండ్రి పెట్టిన కేసుతోనే.. వివరాలు..

Vanitha Vijay Kumar Arrested

Vanitha Vijay Kumar Arrested

ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమార్తె వనిత మరొకసారి వార్తల్లోకి ఎక్కారు,సొంత తండ్రి ఇంటిని ఆమె కబ్జా చేయబోయిన నేపథ్యంలో,ప్రస్తుతం ఆమె అరెస్ట్ అయ్యారని తెలుస్తుంది..

రెండు-మూడేళ్ళ నుంచి ఈ గృహం విషయంలో వివాదం నడుస్తూ ఉంది.. చెన్నై లో గల అష్టలక్ష్మి నగర్ లో విజయ్ కుమార్ కి ఒక ఇల్లు ఉంది,ఆ ఇంటిని విజయ్ కుమార్ షూటింగ్ ల కోసం అద్దెకు ఇస్తుంటాడు.. వనిత ఆ ఇంటిని అద్దెకు అడగడంతో విజయ్ కుమార్ ఆమెకు ఇచ్చాడు..

అయితే ఆ ఇంట్లో తిష్ట వేసిన వనిత ఖాళీ చేయకపోవడంతో రెండు నెలల క్రితం పోలిసుల సహాయంతో వనితను ఆ ఇంటి నుంచి ఖాళీ చేయించారు విజయ్ కుమార్.. ఆ సందర్భంగా తండ్రీ కూతుళ్ళ మధ్యన ఒక మినీ యుద్ధమే జరిగింది..

తాజాగా వనిత తనకి తండ్రి నుంచి రక్షణ కావాలంటూ సుప్రీమ్ లో కేసు వేసారు,ఈ నేపథ్యంలో కోర్ట్ ఆమెకు భద్రతా కల్పించాలంటూ పోలీసులని ఆదేశించింది.. ఇది సాకుగా తీసుకుని వనిత మళ్ళీ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయగా,విజయ్ కుమార్ పోలీసులకి ఫిర్యాదు చేసి ఆమెను అరెస్ట్ చేయించారు..

అయితే అరెస్ట్ అయిన కొద్దిసేపటికే పోలీసులు ఆమెను విడుదల చేసినట్లు సమాచారం.. తెలుగు లో వనిత దేవి అనే సినిమాలో నటించారు,విజయ్ కుమార్ అనేక తెలుగు,తమిళ చిత్రాలలో ముఖ్య పాత్రలు పోషించారు.. ఏది ఏమైనాఈరోజుల్లో కుటుంబ సంబంధాలను కూడా డబ్బు ఎంత విచ్చిన్నం చేస్తుంది అనేది ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది,తండ్రికి ఎంత మంచి పేరున్నా ఇప్పుడు కూతురు వల్ల రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి దాపురించింది,కలికాలం కదూ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed