దివ్యంగురాలైన అమ్మాయి కోసం పరీక్ష రాసిన నటుడు తనీష్.. ఎంతో విలువైన పాఠం నేర్చుకున్నా అంటూ ఉద్వేగపూరితమైన పోస్ట్..

Tanish Exam Scribe

Tanish Exam Scribe

ప్రముఖ నటుడు బిగ్ బాస్ ఫేమ్ తనీష్ హఠాత్తుగా పరీక్ష హాల్ లో ప్రత్యక్షమయ్యారు,అయితే అదేదో సినిమా షూటింగ్ కోసం మాత్రం కాదు.. దివ్యంగురాలైన ఒక అమ్మాయి తరపున పరీక్ష రాసి,తన అనుభవాలను సోషల్ మీడియా లో పంచుకున్నారు తనీష్..

లైఫ్ లో మనం తీసుకునే రైట్ డెసిషన్స్ వల్ల మనం కొన్ని నేర్చుకుంటాం.. కొన్ని సార్లు మనం తీసుకునే రాంగ్ డెసిషన్స్ మనకి కొన్ని నేర్పిస్తాయి.. ఏది ఏమైనా నేర్చుకుంటూనే ఉండాలి,ఆగకూడదు!

అప్పట్లో నటన/ఇతర పరిస్థితుల మూలంగా నా చదువుని మధ్యలో ఆపేయవలిసి వచ్చింది..కానీ అదంతా ఈరోజు నాగమణి కోసం పరీక్ష రాస్తుంటే తిరిగొచ్చినట్లు అనిపిస్తుంది..మనలో ఒక మైనస్ మనల్ని ఆపకూడదు అని ,తన ద్వారా నాకు తెల్సింది..

తను ప్రపంచాన్ని చూడలేకపోయినా ,సబ్జెక్టు నేర్చుకొని,పరీక్షలో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది.. అందులో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది..

పరీక్ష పూర్తయిన వెంటనే ఎదో తెలియని ఆనందం,ఆత్మ సంతృప్తి ఆ అమ్మాయి మొహం లో నేను గమనించాను.. గాడ్ బ్లెస్స్ యు తల్లీ.. ఇక నన్ను అభిమానించే వారికోసం ఒక మాట చెప్పదల్చుకున్నా సహాయం అనేది ధన రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు.. చెయ్యాలనే ఆలోచన ఉండాలే కానీ చేయడానికి చాలా ఉన్నాయి.. మీ హృదయాన్ని సరైన స్థానంలో ఉంచితే అంతా మంచే జరుగుతుంది.. మీకు కూడా ఇలాంటి అనుభవం కలుగుతుంది అని ఆశిస్తున్నా.. అని ఎమోషనల్ పోస్ట్ చేసారు తనీష్..

బాల నటుడిగా తెలుగు తెరకి పరిచయమైన తనీష్,నచ్చావులే చిత్రంతో హీరోగా మారారు.. ఆ చిత్రం విజయవంతమైన తర్వాత చిత్రాలు అనుకున్న స్థాయి విజయం సాధించలేకపోయాయి.. ఈ మధ్యన వచ్చిన బిగ్ బాస్ తో మరొక్కసారి తనీష్ లైమ్ లైట్ లోకి వచ్చారు.. ఏది ఏమైనా తనీష్ చేసిన మంచి పని కచ్చితంగా మెచ్చుకోతగ్గదే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed