శింబు అభిమాని అతి,క్రేన్ కి వేలాడుతూ హీరో కట్ అవుట్ కి పాలాభిషేకం.. వైరల్ అవుతున్న వీడియో.. తిట్టిపోస్తున్న నెటిజెన్లు ..

Simbu Cutout Video

Simbu Cutout Video

అభిమానించడం కావొచ్చు ,ద్వేషించడం కావొచ్చు,తమిళులు ఎప్పుడూ కూడా అతి చేస్తూ ఉంటారు.. తమ అభిమాన హీరో కటౌట్ కి దండాలు వేయడం మన వైపు సాధారణంగా జరిగేదే,అయితే వీరు మాత్రం బీరు,పాలతో ఆ కటౌట్ కి అభిషేకాలు చేస్తుంటారు..

తాజాగా ఒక అభిమాని చేసిన ఇలాంటి పని ఒకటి సోషల్ సోషల్ మీడియా లో వైరల్ అయింది .. గతవారం శింబు హీరోగా నటించిన చెక్క చేవింత వానం (తెలుగులో నవాబ్) విడుదలైన సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా ఒక అభిమాని అతిగా ప్రవర్తించాడు..

ఒక క్రేన్ కి తనను తాను వేలాడదీసుకున్న ఈ అభిమాని,ఒక పాల ప్యాకెట్ తీస్కుని తన అభిమాన హీరో శింబు కి అభిషేకం చేసాడు.. భారీ ఎత్తున్న ఆ కటౌట్ పైకి ఎక్కి కూడా ఆ అభిమాని రిస్క్ చేయడం గమనార్హం..


అయితే నెటిజన్లు మాత్రం ఈ వీడియో పై తీవ్రంగా స్పందించారు,తన హీరో పై అభిమానం ఉండొచ్చు కానీ,మరీ ఇలా ప్రాణాంతకమైన ఫీట్లు చేయాల్సిన అవసరం లేదు అని వారు తెలిపారు.. ఇక శింబు ఫ్యాన్స్ కూడా ఆ అభిమాని అతిని ఖండించారు.. అభిమానం ఉండటం మంచిదే కానీ,ఇలా అతి చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం శింబు కూడా హర్షించడు అంటూ ఆ అభిమానికి క్లాస్ పీకారు..

ఏది ఏమైనా సోషల్ మీడియా విస్తృతి పెరిగాకా తమ హీరో పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించడం కోసం ఇలాంటి అతి చేష్టలు చేస్తున్నారు కొంతమంది అభిమానులు.. అయితే హీరోలు మాత్రం ఇలాంటి వాటిని ప్రోత్సహించడం లేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed