ప్రభాస్ పెళ్లికన్నా రానా పెళ్లే ముందు,కాఫీ విత్ కరణ్ లో ప్రభాస్ పెళ్లి కాకపోవడానికి వెనుక ఉన్న కారణం తెలిపిన రాజమౌళి..

Prabhas Marriage Comments Rajamouli

Prabhas Marriage Comments Rajamouli

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు బాహుబలి ప్రభాస్ ,వయసు నలభైకి దగ్గర పడుతున్నా ఇప్పటికీ ప్రభాస్ కి పెళ్లి చేసుకోకపోవడం ఫ్యాన్స్ కి పెద్ద మిస్టరీ.. అయితే ఈ మిస్టరీ వెనుక ఉన్న రహస్యాన్ని దర్శకుడు రాజమౌళి బయటపెట్టారు..

తాజాగా స్టార్ టీవీ లో ప్రసారం అవుతున్న కాఫీ విత్ కరణ్ షో లో ప్రభాస్,రానా,రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాస్ పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నకు రాజమౌళి ఆసక్తికర సమాధానం ఇచ్చారు.. ప్రభాస్ కన్నా ముందే రానా ఒక ఇంటి వాడు అవుతాడు అని తెలిపారుట రాజమౌళి..

నిజానికి ప్రభాస్ కి పెళ్లి కాకపోవడానికి కారణం అతనికి ఉన్న బద్ధకమే ప్రధాన కారణం అని తెలిపారు రాజమౌళి.. ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఎన్నో సార్లు ప్రభాస్ ప్రయత్నాలు అంటే సంబంధాలు చూడడం మొదలు పెట్టగానే ప్రభాస్ బద్ధకం తో పక్కన పెట్టేసేవాడు అని రాజమౌళి అన్నారు..

ప్రభాస్ బద్దకాన్ని విసుగు చెందిన కృష్ణం రాజు కూడా ఇక ప్రభాస్ పెళ్లి ప్రక్కన పెట్టేసారు అని చమత్కరించారు రాజమౌళి.. బాహుబలి సినిమా రెండు భాగాలు విడుదల అయ్యే వరకు పెళ్లి చేసుకోను అని ప్రభాస్ గతంలో ప్రకటించారు,అయితే ఆ సినిమా పూర్తయ్యాక సాహో లో బిజీ అయిపోయారు ప్రభాస్..

ఇక 2019 లో అయినా ప్రభాస్ ఒక ఇంటివాడు అవుతాడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులు..ఈ బాహుబలి స్పెషల్ కాఫీ విత్ కరణ్ డిసెంబర్ 23న స్టార్ వరల్డ్ లో ప్రసారం కానుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed