యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ప్రముఖ యాంకర్ గాయత్రీ భార్గవి క్యూట్ గిఫ్ట్,అమ్మకిస్తానండీ అంటూ అపురూపంగా తీసుకున్న ఎన్టీఆర్..

NTR Gift Gayatri Bhargavi

NTR Gift Gayatri Bhargavi

ప్రముఖ యాంకర్ గాయత్రీ భార్గవి,ఒక క్యూట్ గిఫ్ట్ ఇచ్చి ఎన్టీఆర్ ని ఆశ్చర్యానందాల్లో ముంచెత్తారు.. ఆమె ఇచ్చిన బహుమతి కి మురిసిపోయిన ఎన్టీఆర్ అపూర్వంగా ఆ బహుమతి ని తన తల్లికి ఇస్తాను అంటూ ఆమెతో తెలిపారు..

ఈ సంఘటన ఎన్టీఆర్ విడుదలకి సిద్ధమైన అరవింద సామెత చిత్ర ప్రమోషన్స్ లో జరిగింది.. తన తాత గారైన శంకరనారాయణ గారు వేసిన ఎన్టీఆర్ తండ్రి దివంగత నందమూరి హరికృష్ణ చిత్ర పటాన్ని ఆమె ఎన్టీఆర్ కు బహుకరించారు..

“90 ఏళ్ళ మా తాత గారు వేసిన పెన్సిల్ స్కెచ్,ఇప్పుడు ఎన్టీఆర్ చేతికి చేరింది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్ళల్లో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేము.. అయన అమ్మకి ఇస్తాను అండి ,థాంక్యూ అన్నారు ” అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు గాయత్రి..

ఈమధ్యన రోడ్డు ప్రమాదం లో మరణించిన తన తండ్రి నందమూరి హరికృష్ణ ను తల్చుకుని ఎన్టీఆర్ అరవింద సామెత ఆడియో ఫంక్షన్లో కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెల్సిందే.. అయితే హరికృష్ణ గారు చనిపోయిన 10 రోజు నుంచే షూటింగ్ కి వచ్చి,సినిమా నిర్మాతలకు ఇబ్బంది లేకుండా చేసారు ఎన్టీఆర్.. ఈ విషయమై ఎన్టీఆర్ పై ప్రశంశల జల్లు కురిసింది..

ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్- ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న “అరవింద సమేత” రేపు విడుదల కానుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed