మనసున్న మారాజు: బాలయ్య కాళ్ళు మ్రొక్కిన అభిమాని,సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఫోటో వెనుక ఇదీ కథ..

NBK Fan Help

NBK Fan Help

ఈ మధ్యన అభిమానులపై తరచుగా సినీ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే బాలయ్య పై చేయి చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.. అయితే తమ హీరోకి బౌన్సర్లు కానీ ,సెక్యూరిటీ కానీ ఉండరని,ఇక బహిరంగ ప్రదేశాల్లో తమ హీరో మీద పడిపోతే అయన అభిమానులని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఆలా జరుగుతుంది అని అయన అభిమానులు చెప్తుంటారు..

ఇక కొట్టే చేతికే పెట్టె గుణం కూడా ఉంటుందని,అయన అభిమానులు చెప్పినట్లుగానే నిన్న ఒక సంఘటన చోటు చేసుకొంది. ప్రస్తుతం బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో భాగంగా దివిసీమ లో ఉన్నారు. అక్కడ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఒక అభిమాని వచ్చి హఠాత్తుగా అయన కాళ్ళ మీద పడిపోయారు..

ఆ అభిమానిని పైకిలేపి బాలయ్య సంగతి ఏంటని అడుగగా,తాను కాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను అని,అయితే చికిత్స చేయించుకోలేని నిరుపేదనని అని ఆ వృద్ధుడు వాపోయాడు.. వెంటనే బాలయ్య బసవతారకం ఆసుపత్రి కి ఫోన్ చేసి, ఆ వృద్ధుడి వివరాలు తెలియజేసి,అతను నా అభిమాని, ఉచిత వైద్యం అందించాలని,జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆదేశించారట..

ఈ విషయాన్ని అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు.. ఇక ప్రత్యర్థి హీరో అభిమానులు కూడా బాలయ్య మంచి మనసుని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు..

ఇక ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే.. అయితే చిత్రబృందం ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి.. మొదటి భాగం “కధానాయకుడు -ఎన్టీఆర్ ” జనవరి 9-2019 న విడుదల కాబోతుండగా,రెండవ భాగం “మహానాయకుడు -ఎన్టీఆర్” జనవరి 24 -2019 న విడుదల కాబోతుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed