ముగ్గురి భార్యల్లో ఆమె బెస్ట్, పవన్ మూడు పెళ్లిళ్ల పై నాగబాబు ఆసక్తికర విశ్లేషణ..

Nagababu on Pawan Kalyan Marriages

పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు అంటూ వైకాపా అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర విశ్లేషణ చేసారు.. తన తమ్ముడు చేసుకున్నది 3 పెళ్లిళ్లే అని,నాలుగో పెళ్లి సంగతి తమకి తెలియదని అయన చమత్కరించారు..

ఒక ఇంటర్వ్యూ లో నాగబాబు మాట్లాడుతూ,పవన్ ఏమైనా స్కామ్ లు చేస్తేనో ,అధికార దుర్వినియోగం చేస్తేనో మాట్లాడితే అర్ధం ఉంది,అంతే కానీ వ్యక్తిగత జీవితం పై ఎందుకు మాట్లాడడం? అన్నారు నాగబాబు

ఇక పవన్ మూడు పెళ్ళిళ్ళని కూడా విశ్లేషించారు నాగబాబు.. అది పవన్ వ్యక్తిగత జీవితం దాని గురించి నేను లోతుగా వెళ్లదలుచుకోలేదు,ఎందుకంటే వాళ్ళు బయట అమ్మాయిలు.. మొదటి భార్య నందిని తో లీగల్ గా విడాకులు తీసుకుని విడిపోయాడు పవన్,ఇక రెండో భార్య రేణు తో కూడా అన్నీ సెటిల్ అయిపోయాయి..ఇందులో సమస్య ఏముంది?

అయితే మొదటి ఇద్దరు అమ్మాయిలు,ముభావంగా ఉండేవారు,మాతో అంతగా కలిసేవారు కాదు.. మూడో అమ్మాయి అన్నా అలా కాదు,సంప్రదాయాలు ,మన వాళ్లకన్నా ఎక్కువ పాటిస్తుంది..చాలా మంచి అమ్మాయి తాను.. అంటూ కితాబిచ్చారు నాగబాబు..

ఇక చిరు,పవన్ ల మధ్యన విబేధాలు ఉన్నాయి అంటూ వస్తున్న కబుర్ల పై కూడా నాగబాబు స్పందించారు.. ఇలాంటి వార్తలు అన్ని గాలి వార్తలే,అంటూ వారి మధ్యన ఉన్నవి కేవలం రాజకీయ విబేధాలు మాత్రమే ఉండేవి,అని ముక్తాయించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed