ఒట్టు బాలయ్య ఎవరో తెలియదు,మెగా బ్రదర్ నాగబాబు సంచలన వ్యాఖ్యలు,ఆగ్రహంతో ఊగిపోతున్న బాలయ్య అభిమానులు..

Nagababu About Balayya

ఎప్పుడూ జబర్దస్త్ టీవీ షో లో పకపకా నవ్వే మెగా బ్రదర్ నాగబాబు నవ్వుల పాలయ్యారు.. ఒక యూ ట్యూబ్ ఛానల్ కి అయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రముఖ నటుడు,హిందూపూర్ ఎం ఎల్ ఏ నందమూరి బాలకృష్ణ ఎవరో తెలియదు అని చెప్పడం ద్వారా నాగబాబు తాజాగా నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు..

ఇంటర్వ్యూ లో నాగబాబు ని ఒక ప్రేక్షకుడు లేఖ ద్వారా రామ్ గోపాల్ వర్మ,బాలయ్య గురించి కామెంట్ చేయమని అడుగగా నాగబాబు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు..

ఆర్ జీ వీ గురించి గతంలోనే తాను స్పందించాను అంటూ,ఇపుడు తాజాగా చెప్పేది ఏమీ లేదు అన్నారు నాగబాబు.. ఇక బాలయ్య గురించి మాట్లాడుతూ “అయన ఎవరో నాకు తెలియదు” అన్నారు నాగబాబు..


అయితే యాంకర్ ప్రశ్నను మరొక్కసారి వేయగా “నాకు నిజంగా బాలయ్య ఎవరో తెలియదు,ఆ సీనియర్ నటుడు బాలయ్య గురించి అయితే తెలుసు” అంటూ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దివంగత బాలయ్య గురించి తెలుసంటూ వ్యాఖ్యానించారు నాగబాబు..

అప్పటికీ ఆ యాంకర్ వదలకుండా “మీకు మీకు రాజకీయపరంగా చాలా ఉండొచ్చు,అయితే మీరంతా సినీ కుటుంబమే కదా,బాలయ్య తెలియకపోవడం ఏమిటి?” అంటూ రెట్టించగా.. “నాకు తెలియదు అంటే వినరేంటి?” అని వ్యంగ్యంగా స్పందించారు నాగబాబు

అయితే రాజకీయపరమైన విభేధాలతోనే నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేసారు అన్నది సుస్పష్టం.. ఎన్ని విభేదాలు ఉన్నా విమర్శలు చేసుకునే ప్రముఖులుని చూసాము కానీ,ఇలా మరీ తెలియదు అంటూ తీసి పారేసే ప్రయత్నం మంచిది కాదు అని చెప్పక తప్పదు..

ఇక నాగబాబు వ్యాఖ్యలపై నందమూరి అభిమానులు అగ్గి మీద గుగ్గిలంలా ఎగిరి పడుతున్నారు.. “చిరంజీవి పేరు చెప్పుకోకపోతే నువ్వు ఎవరికీ తెలియదు” అంటూ కొందరు.. “సూసైడ్ చేసుకుంటాను అన్న పిరికి వాడివి” అంటూ మరి కొందరు నాగబాబు మీద విమర్శల జడివాన కురిపిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed