పవన్ గారు నాదెండ్ల మీకు వెన్నుపోటు పొడుస్తారని సమాచారం ఉంది.. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు,మండిపడుతున్న జనసైనికులు..

Nadendla Pawan Kalyan RGV Comments

Nadendla Pawan Kalyan RGV Comments

తన సినిమా ప్రమోషన్ కోసం ఏదిబడితే అది మాట్లాడేసే ఆర్ జీ వి ఈసారి పవన్ కళ్యాణ్ పై పడ్డారు,పవన్ కళ్యాణ్ కి అనుంగు సహచరుడు నాదెండ్ల మనోహర్ ఆయనకి వెన్నుపోటు పొడవబోతున్నారని తన వద్ద సమాచారం ఉంది అంటూ నిన్న అర్ధరాత్రి ఒక సంచలన ట్వీట్ చేసారు ఆర్ జీ వి..

“నాకు బాగా పరిచయం ఉన్న ఇంటలిజెన్స్ వర్గాలు,పవన్ కళ్యాణ్ అనుచర వర్గాల ఇంకా నాదెండ్ల మనోహర్ కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం నాదెండ్ల పవన్ కళ్యాణ్ కి వెన్నుపోటు పొడవబోతున్నారు అనే సమాచారం ఉంది.. ” అంటూ వర్మ ట్వీట్ చేసారు..

పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలపై పోరాడుతుంటే నాదెండ్ల ఆయనకి వెన్నుపోటు పొడిచేటందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ మరొక పోస్ట్ కూడా చేసారు ఆర్ జీ వి

ఇక ఆర్ జీ వి పవన్ అభిమానులని కూడా వదల్లేదు,మీరైనా మీ పవన్ కి చెప్పండి ,వెన్నుపోటు నుంచి పవన్ తప్పించుకోలేరు అంటూ చురకలు అంటించారు..

తనకి నాదెండ్ల చిరునవ్వు చూస్తుంటే భయం వేస్తుందని,ఆయన తండ్రి భాస్కరరావు కూడా ఎన్టీఆర్ వెనుక ఇలాంటి చిరునవ్వే చిందించేవారు అని ,పవన్ వెన్నుపోటుకి గురి అవ్వకూడదు అని తాను బాలాజీ ని ప్రార్థిస్తాను అని ఆర్ జీ వి సెటైర్స్ వేశారు..

ఇక ఇదంతా ఆర్ జీ వి తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం చేస్తున్న ప్రమోషన్ గా కొందరు కొట్టి పడేస్తుంటే,పవన్ అభిమానులు మాత్రం ఆర్ జీ వి చేష్టలపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed