షాకింగ్ : క్రికెట్ ని తాకిన మీ టూ సెగ.. ముంబయి లోని హోటల్ గదిలో మహిళ పై లైంగిక వేధింపులు జరిపిన శ్రీలంక క్రికెటర్ మలింగ ..

Malinga MeToo Allegations

Malinga MeToo Allegations

సినిమా,కార్పొరేట్,రాజకీయాలు దాటి ఇప్పుడు మీ టూ పోరాటం తాజాగా క్రీడల్లో కూడా మొదలైంది.. ప్రముఖ శ్రీలంక క్రికెటర్ మలింగ ముంబయి లోని ఒక హోటల్ గదిలో తనపై అత్యాచారం చేయబోయాడు అంటూ ఒక మహిళా ట్విట్టర్ ద్వారా ప్రకటించడం,సంచలనాలకు తెర లేపింది.

పేరు చెప్పడానికి ఇష్టపడని సదరు మహిళ ,ప్రముఖ గాయని చిన్మయి ద్వారా తనపై జరిగిన అమానుషాన్ని సోషల్ మీడియా లో పంచుకున్నారు.. ఈ సంఘటన ముంబయి లో కొన్నేళ్ల క్రితం జరిగినట్లు సదరు మహిళ తెలిపారు.. తాను ఐపీఎల్ క్రీడాకారులు బస చేసిన ఒక హోటల్ ని ఒక స్నేహితురాలిని కలుసుకోవడానికి వెళ్ళాను అని,ఆ సమయంలో తనకి మలింగ తారసపడ్డారని తెలిపారు ఆమె..


అయితే తనతో మాట్లాడిన మలింగ,ఆమె స్నేహితురాలు తన గదిలో ఉందని నమ్మించాడు అని,దానితో అతన్ని నమ్మి అతని గదికి వెళ్లిన తనను మంచం పై తోసి ఆక్రమించుకోవాలని ప్రయత్నించాడు అని ఆమె తెలిపారు.. అయితే ఆ సమయంలో “అతడితో పోరాడలేక కళ్లు మూసుకున్నా. నా ముఖాన్ని అతడు వాడుకున్నాడు.” అంటూ ఆమె తెలిపారు..

అయితే అదృష్టవశాత్తూ అదే సమయంలో హోటల్ సిబ్బంది గదిలోకి రావడంతో,తాను బాత్ రూమ్ లోకి దూరి మొహం శుభ్రం చేసుకుని,సిబ్బంది సహాయంతో అక్కడి నుంచి నిష్క్రమించాను అని ఆమె తెలిపారు..

ఇక ఈ విషయమై ఫిర్యాదు చేయాలనుకున్న తనను స్నేహితులు నిరుత్సాహపరిచారని ఎవరికైనా చెబితే ‘అతడు ప్రముఖ క్రికెటర్‌.. నువ్వే కోరి వెళ్లి ఉంటావని నన్ను తప్పుబడతారు’ అని అనడంతో తాను మౌనంగా ఉండిపోయాను అని తెలిపారు..

ఈ విషయంపై మలింగ ఇప్పటివరకు స్పందించలేదు.. ఇక బాలీవుడ్ ని కూడా మీ టూ ఉద్యమం కుదిపేస్తోంది,మొన్నటికి మొన్న దర్శకుడు వికాస్ బెహల్ ని మీ టూ ఆరోపణల పై హృతిక్ రోషన్ తన సూపర్ 24 చిత్రం నుంచి తొలిగించగా,తాజాగా హౌస్ ఫుల్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ ని కూడా చిత్ర బృందం తొలగించింది..

ఇక రాజకీయ రంగంలో కేంద్ర సహాయ మంత్రి అక్బర్ కూడా మీ టూ ఆరోపణల్లో చిక్కుకున్నారు.. మంత్రి రాజీనామా చేయాలి అన్న ఆందోళనలు ఊపు అందుకున్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed