దర్శకేంద్రుడికి పరాభవం : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయడానికి క్యూ లైన్ దాటే ప్రయత్నం,వ్యతిరేకత నేపధ్యం లో వెనక్కి,చిరంజీవి మాత్రం క్యూ లోనే..

K Raghevendra Rao Telangana Elections

K Raghevendra Rao Telangana Elections

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్ర రావు ఈ ఉదయం తెలంగాణ ఎన్నికలలో ఓటు వేయడానికి వెళ్లి పరాభవం మూటగట్టుకున్నారు.. ఓటు వేయడంలో పరాభవం ఏమి లేదు,అయితే అందుకోసం అయన క్యూ లైన్ దాటి నేరుగా ముందుకు వెళ్లడం ఆయనకు పరాభవం తీసుకొచ్చింది..

హైదరాబాద్ లోని స్థానిక ఫిలిం నగర్ క్లబ్ లో రాఘవేంద్ర రావు ఓటు వేయడానికి వెళ్లారు,అయితే క్యూ లైన్ పెద్దగా ఉండడంతో రాఘవేంద్రరావు క్యూ లైన్ దాటి నేరుగా ఓటరు గదిలోకి వెళ్లే ప్రయత్నం చేసారు.. ఈ నేపథ్యంలో క్యూలో నిలబడి ఉన్న మిగతా ఓటర్లు తీవ్ర నిరసన తెలిపారు..

అయితే ఈ పరిణామంతో కలత చెందిన రాఘవేంద్రరావు ఓటు వేయకుండానే వెనుతిరిగారు అని సమాచారం.. అందరికీ ఓటు వేయమని చెప్తున్న టాలీవుడ్ సెలెబ్రిటీలే ఇలా క్యూ దాటడం,ఓటు వేయకుండా వెనుతిరగం వింతగా లేదు..
ఇక 2014 ఎన్నికల్లో క్యూ లైన్ దాటడానికి ప్రయత్నించిన నటుడు చిరంజీవి మాత్రం, ఈసారి బుద్ధిగా క్యూ లైన్ లోనే నుంచుని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు.. అయన తన కుటుంబ సమేతంగా వచ్చి మరీ ఓటింగ్ లో పాల్గొన్నారు..

నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి షాలిని,సతీమణి ప్రణతి తో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఈ సందర్భంగా కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తున్న తన సోదరి సుహాసిని గెలవాలి అని ఆకాంక్షించారు ఎన్టీఆర్..

తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed