రామ్ అభిమానులకి పండగే, హలో గురు ప్రేమ కోసమే కోసం దక్షిణాది సినిమాల్లో మొట్టమొదటిసారిగా ఒక రకంగా కొత్త డ్యాన్స్ చేయబోతున్న రామ్..

Hero Ram Latest Dance Step

Hero Ram Latest Dance Step

చాక్లెట్ బాయ్ రామ్ విడుదలకి సిద్ధమైన తన తాజా చిత్రం “హలో గురు ప్రేమ కోసమే” కోసం డ్యాన్సుల్లో ఒక సరిక్రొత్త ప్రయోగం చేస్తున్నారు.. పాపింగ్ పేరుతొ దక్షిణాది సినిమాలలో మొట్టమొదటి సరిగా ఒక డాన్సింగ్ స్టైల్ ని పరిచయం చేయబోతున్నారు రామ్..

ఈ విషయాన్నీ రామ్ తన అభిమానులతో పంచుకున్నారు.. “అడిగారుగా,దక్షిణాది సినిమాలలో మొట్టమొదటిసారిగా పాపింగ్ అనే సరిక్రొత్త నృత్య రీతిని పరిచయం చేస్తున్నాం.. నా తదుపరి చిత్రాల్లో కూడా ఈ నృత్య రీతిని మరింత ముందుకి తీసుకెళ్తా.. మీకు ఈ స్టెప్స్ నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పాటకి విజయ్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు” అంటూ తెలిపారు రామ్.

పాపింగ్ అనే నృత్య రీతి 1970 దశకంలో కాలిఫోర్నియా లో పుట్టింది అంటారు.. ఈ నృత్య రీతిలో డాన్సర్ తన శరీర కండరాలను ఒక్కసారిగా సంకోచం,వ్యాకోచం జరిగేలా చేస్తూ స్టెప్స్ వేస్తుంటారు.. “పెద్ద పెద్ద కళ్ళు” అన్న ఈ పాటలో కూడా రామ్ ,నటి ప్రణీత వెంటపడుతూ ఈ పాపింగ్ స్టైల్ లో స్టెప్స్ వేస్తూ కనిపిస్తారు…

ఇక హలో గురు ప్రేమ కోసమే చిత్రంలో ప్రణీత తో పాటుగా అనుపమ పరమేశ్వరన్ కూడా జంటగా నటిస్తున్నారు.. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ఈ నెల 18 న విడుదల కానుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed