ఎన్టీఆర్ తో సెల్ఫీ కావాలంటూ ముచ్చటపడ్డ ప్రముఖ హీరో తల్లి,ఆమె సరదా తీర్చిన ఆ హీరో.. ఎవరంటే.

Hero Mother Selfie NTR

Hero Mother Selfie NTR

అతను ఒక యువ హీరో,సినీ రంగంలో నిలబడాలని కసితో వచ్చారు.. ఆయన ఆశని నిలబెట్టుకున్నారు కూడా,అయితే తన ఆశయం కన్నా,తన తల్లి ముచ్చట తీరితేనే ఎక్కువ సంతోషపడతాను అని భావించిన ఆ హీరో ,తన తల్లిని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సెల్ఫీ దిగేలా చేసి సంతోష పడేలా చేసారు..
Hero Mother Selfie NTR
ఆ హీరో ఎవరో కాదు,అందాల రాక్షసి తో పరిచయమైన నవీన్ చంద్ర.. ప్రస్తుతం నవీన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి “అరవింద సమేత” చిత్రం లో నటిస్తున్నారు.. ఈ సందర్భంగా షూటింగ్ విరామంలో ఎన్టీఆర్,త్రివిక్రమ్ లతో కలిసి తన తల్లి ఫోటోలు దిగేలా చేసి సంతోష పెట్టారు నవీన్..

ఈ సంతోషాన్ని సోషల్ మీడియా లో పంచుకున్న నవీన్ ‘‘నీవు కలగన్నదాన్ని సాధించుకోవడంలో సక్సెస్ ఉండదు. నా విషయంలో సక్సెస్ అంటే మా అమ్మ కలను నిజం చేయడమే. తారక్ గారిలోని బెస్ట్ క్వాలిటీ ఏంటంటే సింప్లిసిటీ, విధేయత. అమ్మా, నీ ఎగ్జైట్‌మెంటే నా బలం, ప్రేరణ. నీ ప్రతి కలను నెరవేర్చడాన్నే నా కలగా మార్చుక్చున్నా. థాంక్యూ తారక్, త్రివిక్రమ్ గారు’’..

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదటి సరిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత చిత్రం ఈ నెల 11 న విడుదల కానున్న సంగతి తెల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed