ఫ్లాష్ : ప్రవచనాలకు ప్రముఖ సహస్రావధాని గరికపాటి స్వస్తి ,ప్రజల సమక్షంలో సంచలన నిర్ణయం వెల్లడి

Garikapati Retires Pravachanams

ప్రముఖ సహస్రావధాని,ప్రవచనకర్త,గరికపాటి నరసింహారావు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇక నుంచి తాను ప్రవచనాలకి స్వస్తి పలకనున్నట్లు అయన కొద్దిరోజుల క్రితం ప్రకటించారు..

ఒక ఏడాది నుంచి తన మనసు లోపలకి వెళ్ళు ,నువ్వు ఎవరో తెలుసుకో అని చెపుతుంది అని,ఈ నేపథ్యంలో తన కుటుంబ సభ్యులతో సంప్రదించి ప్రవచనాలకి ఇక స్వస్తి పలకాలి అని నిర్ణయం తీసుకున్నట్లు అని ఆయన తెలిపారు.. ఇక నుంచి ఎక్కువ సమయం రమణ మహర్షి స్ఫూర్తి తో ఎక్కువ సమయం మౌనంలో గడపాలి అని నిర్ణయం తీసుకున్నట్లు అని గరికపాటి తెలిపారు..

దివంగత నటుడు శోభన్ బాబు తనకు ఆదర్శం అంటూ ఈ సందర్భంగా గరికపాటి గుర్తు చేసుకున్నారు.. “అయన కెరీర్ మంచి స్థాయిలో ఉండగానే గౌరవప్రదంగా రిటైర్ అయ్యారు,అదే నాకు కూడా స్ఫూర్తి ” అన్నారు గరికపాటి..

ఈ నిర్ణయం వెల్లడిస్తున్నప్పుడు అయన భావోద్వేగంతో కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు.. “మనసు అనే పాల సరోవర తీరంలో శివుడు ప్రత్యక్షం కావడానికి ,ఆత్మలోనే సరస్వతి దేవి ని దర్శించడానికి ఇక నుంచి ఇంటిలోనే మౌనంగా తపస్సు చేయాలనీ నిర్ణయించుకున్నా” అంటూ అయన తెలిపారు..

అయితే ప్రస్తుతం తాను ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాలను పూర్తి చేయాల్సి ఉందని, లలితా సహస్రనామ పారాయణంలో ఇంకా 800 నామాలపై ప్రసంగాలు ఇవ్వాల్సి ఉందన్నారు.అటువంటి పనిని మధ్యలో ఆపడం అపచారం అవుతుంది కనుక  ఏప్రిల్ నాటికి 2019 ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్టు వివరించారు.  

ఇక గరికపాటి వారసుడిగా అయన కుమారుడు ప్రవచనాలలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.. క్రొత్త తరం,క్రొత్త నీరు వస్తుంది,అంటూ గరికపాటి తెలిపారు.. తెలుగు లో ఉన్న సహస్రావధానుల్లో ప్రవచనకర్త గా ఉన్న విలక్షణత గరికపాటి సొంతం.. ముఖ్యంగా యువతకు సరదాగా సందేశం ఇవ్వటం గరికపాటి ప్రత్యేకత.. ఏది ఏమైనా అయన ఈ నిర్ణయం మాత్రం అభిమానులకి షాక్ ఇచ్చింది అన్నది వాస్తవం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed