అనుకోకుండా జరిగిపోయింది : రోజా -బండ్ల గణేష్ టీవీ లైవ్ షో లో తిట్ల పురాణం పై ,ఏడాది తర్వాత ఊహించని విధంగా స్పందించిన బండ్ల గణేష్

Bandla Ganesh Roja Controversy

Bandla Ganesh Roja Controversy

బండ్ల గణేష్ మెగా ఫ్యామిలీ కి తనకు తాను భక్తుడిగా అభివర్ణించుకుంటారు.. పవన్ కళ్యాణ్ ని దేవుడు అంటూ స్పందించే గణేష్,ఏడాది క్రితం ఒక టీవీ షో లో ,నటి/ఎమ్మెల్యే రోజా పై పరస్పరం తిట్ల పురాణం లంకించుకున్న సంగతి తెల్సిందే.. అప్పట్లో “పవన్ కి పక్కలేసావా” అంటూ రోజా సంభోదిస్తే,”నువ్వు కూడా రా” అంటూ గణేష్ బదులివ్వడం పెను సంచలనమే రేపింది..

ఇప్పుడు తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూ లో బండ్ల గణేష్ ఆ నాటి సంఘటన ని గుర్తు చేసుకున్నారు.. “ఆ రోజు ఎదో ఆవేశంలో అలా జరిగిపోయింది ,ఆమె అన్న మాటకి నాకు ఆవేశం వచ్చి ఆమెను దూషించాను.. నిజానికి ఆమె పై నాకు ఎటువంటి ద్వేషం లేదు..

ఆమెను ఆ రోజు అలా దూషించినందుకు చాలా బాధ పడ్డాను ,నిజానికి రోజా నాకు సోదరి వంటిది” అంటూ నిజాయతీగా పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచారు గణేష్..సినీ నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన గణేష్ ,నిర్మాతగా మారి గబ్బర్ సింగ్,టెంపర్ మొదలైన సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన సంగతి తెల్సిందే..

ప్రస్తుతం గణేష్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు.. తెలంగాణ లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అయన కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed