షాకింగ్ : నటి ఆశ షైనీ పై దారుణంగా దాడి చేసి కొట్టిన బాలీవుడ్ నిర్మాత.. మీ టూ ఉద్యమం లో భాగంగా పాశవిక దాడి వివరాలు వెల్లడించిన ఆశ..

Asha Saini Me Too Attack

Asha Saini Me Too Attack

తెలుగులో నరసింహనాయుడు,నువ్వు నాకు నచ్చావ్ మొదలైన సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆశ షైనీ తనపై జరిగిన భయంకర దాడి వివరాలు సోషల్ మీడియా లో పంచుకున్నారు.. 2007 లో ప్రముఖ నిర్మాత గౌరంగ్ దోషి తన పై ఈ పాశవిక దాడి జరిపారు అని ఆమె చెప్తున్నారు..

ఈ దాడిలో ఆమెకు దవడ ఎముక విరిగిపోయందని,అంతే కాకుండా మనసుకి కూడా అంతకన్నా ఎక్కువే గాయం జరిగిందని ఆమె తెలిపారు.. ఆమె ఈ ఉదయం ఉంచిన ఫేస్ బుక్ పోస్ట్లో తాను ఎదురుకున్న నరకాన్ని కళ్ళకి కట్టినట్లు వివరించారు ఆశ..

“అది నేనే. 2007 ప్రేమికుల దినోత్సవం నాడు గౌరంగ్‌ దోషి నన్ను దారుణంగా కొట్టాడు. ఏడాది పాటు నాకు నరకం చూపించాడు. దాని ఫలితంగానే నా ముఖంపై చెరిగిపోని గాట్లు పడ్డాయి. ఆ సమయంలో నేను ఈ విషయాలన్నీ బయటపెట్టాను. కానీ నన్ను ఎవ్వరూ నమ్మేవారు కాదు. ఎందుకంటే అప్పట్లో గౌరంగ్‌కు బాగా పలుకుబడి ఉండేది.

నాకు సినిమా అవకాశాలు రానివ్వకుండా చేస్తానని చాలా సార్లు బెదిరించాడు. కొన్ని సందర్భాల్లో నన్ను సినిమాల్లోకి తీసుకున్నట్లే తీసుకుని తొలగించిన రోజులూ ఉన్నాయి. నన్ను ఆడిషన్స్‌కు కూడా పిలవడానికి ఇష్టపడేవాళ్లు కాదు

ఆ క్షణాన నేను నోరుతెరవకుండా ఉండాల్సింది అనిపించింది. కేవలం నా ప్రతిభ చూసి అవకాశాలు ఇచ్చే వారు ఎవరైనా ఉంటే వారి వద్దకు పారిపోయి తలదాచుకోవాలని అనుకున్నాను. నేనే కాదు నాలాంటి ఎందరో ఆడవాళ్లు గౌరంగ్‌ కారణంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. వారంతా నాకు ఫోన్లు చేసి సాయం చేయమని అడిగారు. కానీ నేను ఆ ధైర్యం చేయలేకపోయాను. తమ పట్ల జరిగిన దారుణాల గురించి బయటపెడుతున్నవారి కోసం నేను ఈ పోస్ట్‌ పెడుతున్నాను.’

‘మీరే నా సూపర్‌ హీరోస్‌. మీలాంటి వారు సమాజానికి ఎంతో అవసరం. గౌరంగ్‌ వల్ల నా జీవితంలో చాలా నష్టపోయాను. ఆ ఘటన తర్వాత నా జీవితంలో నేను బాగుచేయలేని మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ ఆ దేవుడి ముందు ఎవ్వరూ ఎక్కువ కాదు అని నమ్మేదాన్ని. నిజాన్ని నమ్ముకోండి. దాన్ని ఆయుధంలా ధరించండి. మళ్లీ మనమంతా సంతోషంగా ఉందాం. ఇలాంటి వారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం’ అంటూ భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టారు ఆశ..

గత రెండు రోజులుగా సినీ,మీడియా వర్గాలకి చెందిన మహిళలు తాము పని చేసే చోట ఎదుర్కుంటున్న లైంగిక వేధింపులు మీ టూ అనే కాంపెయిన్ రూపం లో సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.. తాజాగా బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటుడు సంస్కారి అలోక్ నాథ్ కూడా,తన సహా నటి ద్వారా లైంగిక వేధింపులు ఎదురుకుంటున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed