నాయుడు గారూ కొంచెం దూరంగా ఉండండి.. కాజల్ రచ్చ నేపథ్యంలో చోటా కే నాయుడు కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన యాంకర్ శ్యామల..

Anchor Syamala Chota K Naidu Comments

Anchor Syamala Chota K Naidu Comments

కొద్ది రోజుల క్రితం నటి కాజల్ అగర్వాల్ కి స్టేజి మీద ముద్దు పెట్టి ప్రముఖ కెమెరా మ్యాన్ చోటా కే నాయుడు అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెల్సిందే..చోట ప్రవర్తన పై సోషల్ మీడియా లో సెటైర్స్ పడుతుండగా,తాజాగా ఆయన్ని దూరంగా ఉండమంటూ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు యాంకర్ శ్యామల..

ఇక విషయానికి వస్తే నిన్న జరిగిన కవచం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో యాంకర్ శ్యామల చోటా ని స్టేజి పైకి ఆహ్వానించారు… చోటా శ్యామల కి పుష్ప గుచ్ఛం అందించి వెళ్లిపోగా,శ్యామల మాత్రం సరదాగా కామెంట్స్ చేసారు..

“సార్ ఆల్ రెడీ టీజర్ లాంచ్ ఫంక్షన్ చాలా ట్రెండింగ్ గా ఉంది.. నేను మీకు కొంచెం దూరంగా ఉంటా” అంటూ చోట నర్మగర్భంగా సెటైర్స్ వేశారు శ్యామల..గతంలో కాజల్ కి జరిగిన అనుభవం నేపథ్యంలోనే శ్యామల ఈ కామెంట్స్ చేసారు అంటున్నారు..
Chota K Naidu Kissing Kajal
కవచం టీజర్ లాంచ్ ఫంక్షన్ లో చోటా కే నాయుడు,హీరోయిన్ కాజల్ అగర్వాల్ బుగ్గ పై బలవంతం గా ముద్దు పెట్టిన సంగతి తెల్సిందే.. ఈ విషయమై అప్పట్లో చోటా స్పందిస్తూ తనని సంగీత దర్శకుడు థమన్ కాజల్ ని ముద్దు పెట్టుకోవాలి అని ప్రోత్సహించినట్లు తెలిపారు.. “మనలాంటి సామాన్యులు కాజల్ ని ముద్దు పెట్టుకోలేరు అన్నారు థమన్,అందుకే నేను ముద్దు పెట్టి చూపించా” అని స్పందించారు చోటా..

ఇక ఇదే విషయమై కాజల్ కూడా స్పందిస్తూ “పర్లేదు చోటా,నువ్వు నా కుటుంబ సభ్యుడు మాదిరి” అంటూ స్పోర్టివ్ గా స్పందించడం విశేషం.. వారికి వారికీ ఇష్టం అయితే మనకేంటి లే కానీ, స్టేజి మీద ఇలాంటి చేష్టలు మాత్రం చూసేవారికి కొంచెం ఇబ్బందే కదూ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed