ఆసుపత్రిలో చేరిన అందాల నటి సంజన.. ఆపరేషన్ చేయించుకున్నాను అంటూ అభిమానులకి సందేశం..

Actress Sanjana Hospitalized

Actress Sanjana Hospitalized

ప్రముఖ కన్నడ/తెలుగు నటి సంజన ఆసుపత్రిలో చేరారు.. తన శరీరంలో పెరిగిన ఒక కణితిని తీయించుకోవడానికి ఆపరేషన్ చేయించుకున్నట్లు ఆమె అభిమానులకు సందేశం పంపారు..


నిన్న ఈ విషయమై ఆమె సోషల్ మీడియా లో ఒక సందేశాన్ని ఉంచారు..నా అండాశయంలో నెల క్రితం ఏర్పడిన 550 ml కణితిని నిర్మూలించడం కోసం ఆపరేషన్ చేయించుకున్నా.. మహిళలు అందరూ క్రమం తప్పకుండ మమ్మోగ్రామ్ చేయించుకుని తమ గర్భాశయ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి..

అయితే నిన్న ఆపరేషన్ చేయించుకున్న సంజన,ప్రసుతం తాను హాస్పిటల్ లోంచి డిశ్చార్జ్ అయ్యాను అని తెలిపారు.. నిన్నే ఆమె అభిమానుల కోసం పేస్ బుక్ లో లైవ్ ఇచ్చారు కూడా..

బుజ్జిగాడు సినిమా లో తెలుగు వారికీ పరిచయమైన సంజన,ఆ తర్వాత అడపా-దడపా సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా ఇక్కడ గుర్తింపు రాలేదు.. అయితే ఆమె మాతృ బాషా కన్నడ లో మాత్రం మంచి పేరు ఉంది.. సంజన సోదరి నిక్కీ గల్రాని ప్రస్తుతం తెలుగు,తమిళ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు..


దండుపాళ్యం చిత్రం తర్వాత సంజన పెద్దగా సినిమాల్లో నటించలేదు.. ప్రస్తుతం ఆమె స్వర్ణ ఖడ్గం అనే భారీ బడ్జెట్ సీరియల్ లో నటిస్తున్న సంగతి తెల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed