వీడియో : నిర్మాతల మండలి వివాదం, నటుడు విశాల్ అరెస్ట్,కార్యాలయం దగ్గర పోలిసుల తో వాగ్వివాదం..

Actor Vishal Arrest

Actor Vishal Arrest

ప్రముఖ తెలుగు/తమిళ నటుడు నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ అరెస్ట్ అయ్యారు..తమిళ నిర్మాతల మండలి లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో నిన్నటి నుంచి జరుగుతున్న హై డ్రామా నేపథ్యంలో విశాల్ ఈరోజు అరెస్ట్ అయ్యారు..

నిన్న కొంత మంది నిర్మాతలు విశాల్ నాయకత్వంపై తిరుగుబాటు చేసారు,విశాల్ తీసుకుంటున్న నిర్ణయాల పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ,నిర్మాతల మండలి కార్యాలయానికి తాళం వేయడంతో పాటు ,విశాల్ రాజీనామా కు కూడా వారు డిమాండ్ చేసారు..

విశాల్ రూ 7 కోట్ల వరకు నిర్మాతల సంఘం లో అవకతవకలు కు పాల్పడ్డారని కొంత మంది నిర్మాతలు ఆరోపిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఈ ఉదయం కార్యాలయానికి వచ్చిన విశాల్ ను పోలీసులు అడ్డుకున్నారు..

తనకు కార్యాలయంలో వెళ్ళేటందుకు అనుమతించాలని కోరగా,పోలీసులు అంగీకరించలేదు.. ఈ నేపథ్యంలో ఎవరో వేసిన తాళానికి పోలీసులు కాపలా కాస్తున్నారని విశాల్ మండిపడ్డారు,అంతే కాకుండా అవసరమైతే తాళాన్ని బ్రద్దలు కొడతాను అని కూడా విశాల్ ఆగ్రహం వ్యక్తం చేసారు..

వివాదం చిలికి చిలికి గాలివాన గా మారడంతో పోలీసులు విశాల్ ని ,అయన అనుచరులని పోలీసులు అరెస్ట్ చేసారు..ప్రస్తుతం విశాల్ ని తేనాం పేట్ పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు సమాచారం..

ఇది తనని అప్రతిష్ఠపాలు చేసేటందుకు కొంతమంది పన్నిన కుట్ర
అని విశాల్ ఆరోపించారు.. మండలి లెక్కలు మొత్తం జనరల్ బాడీ మీటింగ్ లో సమర్పించడానికి తాను సిద్ధంగా ఉన్నాను అంటూ విశాల్ తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed