తితిలి తుఫాను: బాధితులకి ధన సహాయం ఎవరైనా చేస్తారు,కానీ సేవ మాత్రం మనసున్న వారే చేస్తారు,అచ్చం తెలుగు హీరో నిఖిల్ లా.

Actor Nikhil Titli Cyclone Help

Actor Nikhil Titli Cyclone Help

తెలుగు సినీ పరిశ్రమ తుఫాన్లు,వరదలు మొదలైన విపత్తుల సమయంలో తన వంతు సహాయం తాను అందిస్తూనే ఉంది..అయితే ఈ సహాయం ఎక్కువగా ధన రూపం లోనే ఉండేది,ఇక నేటి తరం నటుల్లో మొట్టమొదటి సారిగా నేరుగా తుఫాను ప్రభావిత ప్రాంతానికి వెళ్ళి అక్కడి ప్రజలకు సేవ చేసి శభాష్ అనిపించుకున్నారు టాలీవుడ్ యువ నటుడు నిఖిల్..

గత వారం శ్రీకాకుళం జిల్లాని కుదిపేసిన తితిలీ తుఫాను కి జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో తాను చేయాలి అనుకున్న సహాయం నేరుగా అక్కడి ప్రజలకు అందించడానికి శ్రీకాకుళం చేరుకున్నారు నిఖిల్.. తన వంతుగా అక్కడి ప్రజలకు “2500 కిలోల బియ్యం,500 దుప్పట్లు,ఇంకా విధ్యుత్ సరఫరా లేని ప్రాంతాల కోసం పోర్టబుల్ జెనెటర్లు సిద్ధం చేసాం..

3000 మందికి సరిపడా ఆహారం కూడా సిద్ధం చేయించాను,ఇదంతా ఈరోజే శ్రీకాకుళంలో సిద్ధం చేసాం,ఇప్పుడు గుడ్డిపేట ,తర్వాత పల్లిసారధి.. ధైర్యంగా ఉండు శ్రీకాకుళం ” అంటూ ట్వీట్ చేసారు నిఖిల్..

ఇంతే కాకుండా అక్కడి తుఫాను బాధితులతో కలిసి భోజనం చేస్తూ,తనకి అది అత్యంత తృప్తి కలిగించిన భోజనం అంటూ సంతోషాన్ని పంచుకున్నారు నిఖిల్..

ఇక ఇతర హీరోలు కూడా తితిలీ తుఫాను భీభత్సానికి బలైన శ్రీకాకుళానికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు .. విజయ్ దేవరకొండ ఇప్పటికే 5 లక్షలు విరాళం ప్రకటించగా,నటుడు ఎన్టీఆర్ 15 లక్షలు,నందమూరి కళ్యాణ్ రామ్ 5 లక్షలు ప్రకటించారు.. వీరందరికీ ఆంధ్ర ప్రదేశ్ ఐటి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed