నా పెళ్లిళ్ల వల్లే రాష్ట్రం విడిపోయిందా?నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలు కి వెళ్లారా? జగన్ విమర్శలపై జనసేనాని సీరియస్ వార్నింగ్..

Pawan Kalyan Warns Jagan

Pawan Kalyan Warns Jagan

తన వ్యక్తిగత జీవితం పై తరచుగా విమర్శలు చేస్తున్న జగన్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. తాము పాలసీ ల పై మాట్లాడుతుంటే జగన్ వ్యక్తిగత జీవితం పై విమర్శలు చేయడం ఏమిటి అంటూ పవన్ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు..
“నా పెళ్లిళ్ల వల్లే రాష్ట్రం విడిపోయిందా? నా పెళ్లిళ్ల వల్లే అవినీతి జరిగిందా?నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలు కి కూడా వెళ్ళారా?ఏమి మాట్లాడుతున్నారు మీరు?నేను మీ వ్యక్తిగత జీవితం పై మాట్లాడితే తట్టుకోలేరు..

మేము పాలసీ ల మాట్లాడుతుంటే మీరు వ్యక్తిగత జీవితం పై మాట్లాడుతున్నారు.. మీ పై దాడి జరిగినప్పుడు నేను మీ అమ్మ గారిని సమర్ధించా ,మీరేమో నా వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేస్తున్నారు..

మీకన్నా దారుణంగా నేను కూడా మాట్లాడగలను,అయితే మా అమ్మ నన్ను దురదృష్టవశాత్తూ అలా పెంచలేదు..చూస్తూ ఉండండి అందరికీ సమాధానం చెప్తా ” అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు పవన్.. జగన్ పై పవన్ ఈ స్థాయిలో విమర్శలు చేయడం ఇదే ప్రధమం అని చెప్పొచ్చు,గతంలో కూడా పవన్ వివాహాల పై జగన్ విమర్శలు చేసినపుడు అది అయన విజ్ఞత కె వదిలేస్తున్నా అంటూ పవన్ స్పందించారు.. తాజాగా పవన్ వివాహ వ్యవస్థను అపహాస్యం చేసారు అంటూ మరొక్కసారి జగన్ విమర్శలు చేయడంతో పవన్ ఈ స్థాయిలో స్పందించినట్లు తెలుస్తుంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed