ఉత్తరాంధ్ర పై జనసేనాని ప్రేమ ఉత్తిదేనా?అంత పెద్ద తుఫాను పై ఇంత పేలవంగా స్పందించటమా, అంటూ ఏకేస్తున్న సొంత అభిమానులు..

Pawan Kalyan Titli Cyclone

Pawan Kalyan Titli Cyclone

జనసేనాని పవన్ కళ్యాణ్ వీలు చిక్కినప్పుడల్లా ఉత్తరాంధ్ర పై మాటల్లో విపరీతమైన అపేక్ష ,అభిమానం చూపించేస్తూ ఉంటారు.. ఉత్తరాంధ్ర వెనుకబాటు పై ఆయన ఒక స్థాయిలో ప్రసంగాలు చేస్తూ ,వార్తల్లో నిలుస్తుంటారు.. ఇక ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యపై అయితే అయన ఒక మినీ ఉద్యమమే నడిపారు తన వ్యాఖ్యలతో.. అయితే ఆ ఉత్సాహం అంతా ఇప్పుడు నీరుగారిపోయిందా?ఉత్తరాంధ్ర ఎదురుకొన్న ఒక పెను ప్రకృతి భీభత్సం తిత్లీ తుఫాను విషయంలో పవన్ ఎందుకు సరిగ్గా స్పందించలేకపోయారు?

ఇపుడు ఈ ప్రశ్నలు ఆంధ్ర రాజకీయ విశ్లేషకులకే కాదు,పవన్ అభిమానులకి కూడా చిక్కు ప్రశ్నల్లాగా మారిపోయాయి.. ఇక అధికార టీడీపీ అభిమానులు ఈ అంశంపై పవన్ ని ప్రశ్నిస్తుండగా ,కొందరు పవన్ అభిమానులు కూడా ఇదే అంశం పై పవన్ కి ప్రశ్నలు ఎక్కు పెడుతున్నారు. తమకి పవన్ అంటే ఎంత అభిమానం ఉన్నా,ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తిత్లీ తుఫాను భాదితులను పరామర్శించకుండా భద్రత సాకుగా చెప్పడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు..
ఇక సోంపేట కి చెందిన ఒక అభిమాని అయితే బహిరంగంగానే జనసేనాని పై తన కోపాన్ని ఈ విధంగా వెళ్లగక్కారు..

“తప్పుంటే క్షమించండి

ఒక జనసేన కార్యకర్తగా సిగ్గు పడుతున్న, ఉద్దానం ఉద్దానం అని గొప్పలు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, తుఫాన్ లో సర్వం కోల్పోయిన ఉద్దానం ని చూడటానికి మీకు సమయం లేదా?? భద్రత లేదని రాలేను అంటారా సార్? వరదల్లో కొట్టుకొని పోతారని భయమా, గాల్లో ఎగిరిపోతారని భయమా సార్?? అంతా సర్దుకుని తరువాత వచ్చి ప్రశ్నించి నా వలనే అయింది అని చెప్పుకుంటార?? విమానాల్లో తిరుగుతూ పార్టీల్లో నాయకులు ని చేర్చుకోవడం మీరు బిజీ గా ఉన్నారని తెలుసు కానీ ఈలోగా చంద్రబాబు మూడు రోజుల నుంచి అన్ని దగ్గర ఉండి సహాయ కార్యక్రమాలు చేస్తున్నాడు మీరు కూడా వచ్చునంటే జనసేన కి మంచి పేరు వచ్చేది.”

అంటూ ఆ అభిమాని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.. ఇక ఈరోజు జనసేన ధవళేశ్వరం బ్యారేజ్ పై జరుపనున్న కవాతు పై కూడా ఆ అభిమాని తన ఆగ్రహాన్ని వ్యక్త పరిచారు.. “తప్పుంటే క్షమించండి, సిక్కోలు లో జనం కష్టాల్లో ఉంటే మనము కవత్తు అవసరమా, మా చావులు పై జనసేన కవత్తు చేస్తారా?? మా కష్టాలు వలన పవన్ గారిపై ఈ పోస్ట్ పెట్టాము” అంతో సదరు అభిమాని పోస్ట్ పెట్టడం కలకలం రేపింది..

నాయకుడంటే ప్రజలకి ఒక అండ,ఒక భరోసా,ప్రకృతి విపత్తులు ఆపదల్లో ప్రజలకి నేనున్నా అని ధైర్యం చెప్పే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు.. ఇక ప్రజల కోసమే తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పే పవన్ మరి ఈసారి తిత్లీ తుఫాను పరామర్శ కన్నా,కవాతు వైపే మొగ్గు చూపడం గురించి,ఎలా సమర్ధించుకుంటారో చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed