రెండు సెంట్ల భూమి లో వరి ఎలా పండిస్తారు జనసేనాని గారు?అన్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో మీకు తెలుసా?

Pawan Kalyan Silly Comments

Pawan Kalyan Silly Comments

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈమధ్యన చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు ఆయన్ని అల్లరిపాలు చేస్తున్నాయి.. మరి ఎవరైనా రాసిస్తే చదువుతారో, లేదంటే అయన ఉత్సాహంలో తడబడతారో తెలియదు కానీ అయన చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల కి ఆయుధాలు గా మారుతున్నాయి..

తాజాగా పశ్చిమ గోదావరి పర్యటన లో ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “తాను కూడా ఒక రైతు నే అని,తనకి రైతు కష్టాలు తెలుసు ” అని వ్యాఖ్యానించారు,బాగానే ఉంది.. అక్కడితో ఆయన ఆపేసి ఉంటె ఏ గొడవ లేదు,అయితే కొసమెరుపుగా అయన మాట్లాడుతూ “నేను కూడా రైతునే,నాకున్న రెండు సెంట్ల (98 గజాల) స్థలంలో తాను వరి పండించేవాడిని ” అని చెప్పడంతో ఇక అయన వ్యాఖ్యలు తెలుగు తమ్ముళ్ళకి ట్రోల్ చేసేటందుకు మంచి ఆయుధాన్ని చేతిలో పెట్టినట్లు అయింది..

ఒక అంచనా ప్రకారం 1 ఎకరం అంటే 100 సెంట్ల భూమిలో గరిష్టంగా 35 బస్తాలు పండించవచ్చు,10 సెంట్ల భూమిలో 3 బస్తాలు పండించగలరు,మరి పవన్ చెపుతున్న లెక్కల ప్రకారం 2 సెంట్ల భూమిలో ఎన్ని బస్తాలు అంటే కేవలం ముప్పావు బస్తా.. అంటే ముప్పావు బస్తా పండిస్తున్నారన్న మాట!ఇది జరిగే పనేనా?

ఇక మరో సందర్భంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అని వ్యాఖ్యానించారు,అయితే ప్రత్తిపాటి పుల్లారావు శాఖ మారి ఇపుడు ఆ స్థానం లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వచ్చి 6 నెలలు అవుతుంది..రాజకీయాల్లో అప్ డేట్ గా ఉండటం నాయకుడి కనీస లక్షణం కదా,ఇలా అయితే ఎలా పవన్ అంటూ ప్రత్యర్ధులు అస్త్రాలు సంధిస్తున్నారు..
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే,ఈ మర్చి లో ఆయన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ జరిగిన నాటి నుంచి,ఇలాంటి ఆరోపణలు,వింత విశ్లేషణలు చేస్తూ నవ్వులపాలు అవుతున్నారు.. తాజాగా అయన తనపై ఎవరో హత్యాయతనానికి కుట్ర పన్నారని,వారి టెలిఫోన్ సంభాషణలు తన దగ్గరకి వచ్చాయని తెలిపారు..

అయితే ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై హత్య కుట్ర కి సంబంధించిన ఆధారాలు పోలీసులకి ఇవ్వాల్సింది అంటే మాత్రం తాను ఉద్యమకారుడిని అని ,ఇలాంటి వాటికి తాను భయపడను అని చెప్పారు.. అంతే కాకుండా హైదరాబాద్ లోని తన నివాసం పై ఎవరో డ్రోన్లు తిప్పారని,తనని అంతమొందించే కుట్రలో ఇది కూడా ఒక భాగమని అయన తెలిపారు,అయితే పవన్ నివాసం హైదరాబాద్ అంటే తెలంగాణా భూభాగంలో ఉండగా,అయన ఆంధ్ర ప్రదేశ్ పాలకులపై దుమ్మెత్తి పోయడం హాస్యాస్పదం అనిపించక మానదు..

ఇక జనసేన అభిమానులు మాత్రం,ప్రత్యర్ధులు అయన మాటల్లోని తప్పులు వెతకడం మాత్రమే పనిలా పెట్టుకున్నారని,అయన నిప్పు అంటూ కవర్ చేస్తున్నా.. ఇలా పొంతన లేని మాటలు,నిరాధార ఆరోపణలతో జనసేనాని ప్రజల విశ్వసనీయతను ఎలా చూరగొంటారో ఆయనకే తెలియాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed