తన పై హత్య కు కుట్ర : జనసేనాని సానుభూతి రాజకీయం మొదలు పెట్టారా?

Pawan Kalyan Sensational Comments

Pawan Kalyan Sensational Comments

పశ్చిమ గోదావరి పర్యటనలో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు,ఈసారి ఏకంగా ఆయన తన హత్యకు కొంత మంది కుట్ర పన్నారని ఆరోపించారు.. అందుకు సంబంధించి ఎవరో ముగ్గురు మాట్లాడుకున్న ఫోన్ కాల్ రికార్డింగ్స్ తన దగ్గరకి వచ్చాయని తెలిపారు.. ఆ వ్యక్తుల పేర్లు,ముఖాలు కూడా తనకి తెల్సు అని చెప్పారు..

అంతే కాకుండా నిజంగా తన హత్య జరిగుంటే ప్రతిపక్షం అధికారపక్షాన్ని,అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ని తిట్టుకుంటూ ఆ అంశాన్ని తెర మరుగు చేసే యత్నం చేసుండేవి అంటూ అయన ఆరోపించారు..అయితే ఇలాంటి వాటికి తాను భయపడను అని,ఇవన్నీ తెలియకుండానే తాను రాజకీయాల్లోకి వచ్చానా అంటూ అయన ప్రశ్నించారు..


అయితే పవన్ ఆరోపణలు రాజకీయ సానుభూతి కోసం చేసారా అనిపించక మానవు ఎందుకంటే..

* ఒకవేళ పవన్ పై హత్యకు కుట్ర జరిగిందనే అనుకున్నా,పవన్ ఆ ఆధారాలు పోలీస్ వారికో,లేదంటే సిబిఐ వారికో ఇచ్చి ఉండొచ్చు కదా?

* సరే కాసేపు అటువంటి కుట్ర ఒకటి జరిగిందనే అనుకుందాం, అసలు జనసేన పార్టీ నిర్మాణం ఇప్పటివరకూ పూర్తి కాలేదు.. కేవలం పవన్ అభిమానులు ,కొంత మంది యువత తప్పితే పవన్ వాస్తవ బలం లేదా ఓటు బ్యాంకు ఇది అని ఒక స్పష్టత లేదు.. అటువంటప్పుడు పవన్ ని అడ్డు తొలగించుకునే ప్రయత్నం ఎవరు చేస్తారు?

* ఇక పవన్ ఉత్తరాంధ్ర పర్యటనలో మాట మట్టుకైనా తీసుకురాని ఈ హత్య యత్నం ఆరోపణ పశ్చిమ గోదావరి పర్యటన లో మాత్రమే ఎందుకు చేసారు?అది కూడా రెండు రోజులుగా దెందులూరు ఎమ్మెల్యే చింతమేనని మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ,జనసేనాని ఈ హత్య యత్నం ఆరోపణలు ఎందుకు వెలుగులోకి తెచ్చారు?

ఇలా అనేక ప్రశ్నలు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అని చెప్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోపణలపై వినిపిస్తున్నాయి.. ఇక ఎన్నికల్లో సానుభూతి కోసం పవన్ ఇలాంటి ఆరోపణలు చేసారా,లేదంటే నిజంగా అటువంటి యత్నం ఒకటి జరిగిందా అనేది కాలమే నిర్ణయించాలి..

1 thought on “తన పై హత్య కు కుట్ర : జనసేనాని సానుభూతి రాజకీయం మొదలు పెట్టారా?

  1. పవన్ సొల్లు కబుర్లు ఆపేసై .నిజంగా నీ దగ్గర వారి వివరాలు వుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ వివరాలు జతపరచు.నీకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎటువంటి పలుకుబడి లేదు.నీ గత చరిత్ర లో నువ్వు గాలి తిరుగుల్లు,సొల్లు వాగుడు తప్ప చేసింది ఎక్కడ ఎమీ లేదు.నీ ఎకిలి వేషాలు ,అతి వాగుడు చూసి ఆంధ్ర రాష్ట్రం లోని కోతులు కొన్ని గోదావరి జిల్లాలు వదిలి పోయాయి.కేవలం కొన్ని పని లేని అల్లరి మూకలు ఈలవెస్టున్నయని నువ్వు రెచ్చి పొతే నీకు మిగిలేది గెడ్డం గొరిగించు కున్న బొచ్చే.
    బొచ్చే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed