ముగిసిన తెలంగాణ ఎన్నికలు.. లగడపాటి సర్వే వచ్చేసింది,విజేతగా ప్రజకూటమి.. వివరాలు..

Lagadapati Telangana Exit Survey

Lagadapati Telangana Exit Survey

దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేకెత్తించిన తెలంగాణ ఎన్నికలు ఎట్టకేలకు ఈ సాయంత్రం ముగిసాయి..ఈ నేపథ్యంలో ఆక్టోపస్ గా పేరున్న లగడపాటి తన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు విడుదల చేసారు..

తన విశ్లేషణ 68% పోలింగ్ ని ఉద్దేశించి చేశాను అని,అయితే 72% పోలింగ్ జరిగింది అని తాను విన్నానని,కాబట్టి కొంచెం అటు ఇటుగా తాను చెప్పింది జరుగుతుంది అని అయన తెలిపారు..


లగడపాటి చెప్తున్న వివరాల ప్రకారం ఈసారి అధికార పార్టీ తెరాస ప్రతిపక్షంలోకి మారనుంది.. 80 కి పైగా స్థానాలలో ప్రజకూటమి సత్తా చూపనున్నట్లు తెలిపారు లగడపాటి.. అయన చెప్తున్న సర్వే ప్రకారం పార్టీలు గెలుచుకునే స్థానాల సంఖ్య ఇది..

తెరాస – 35 [+/-10]
ప్రజా కూటమి – 65 [+/-10]
భాజపా – 7 [+/-2]
ఇతరులు – 7 [+/-2]
ఎం ఐ ఎం – [6-7]

ఇక జాతీయ మీడియా సర్వే ల పై లగడపాటి మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలపై వారి సర్వేలు ఎప్పుడూ నిజం అవ్వలేదు అని అయన తెలిపారు.. “వారి సర్వేలు ఆంధ్ర లో నిజం కాలేదు,తమిళనాడు,కర్ణాటక లో కూడా వారు ఫెయిల్ అయ్యారు,ఇప్పుడు కర్ణాటక లో కూడా అదే జరుగుతుంది”

ఈ రెండు రోజుల్లో జరిగిన పరిణామాలు మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అరెస్ట్,క్రొద్ది రోజుల క్రితం జరిగిన జగ్గా రెడ్డి అరెస్ట్ ప్రజకూటమి కి కలిసి వచ్చింది అని లగడపాటి వ్యాఖ్యానించారు.. ఇక హైదరాబాద్ లో ఓటింగ్ తగ్గడం వెనుక ఉన్న కారణాలు అయన విశ్లేషించారు..

“హైద్రాబాద్ నగరంలో ఓటింగ్ శాతం తగ్గడానికి కారణం,నగరం లో బస్తీలలో నివసించే బీదలు అందర్నీ కొంత మంది 2 రోజుల ముందే వారి సొంత ఊళ్ళకి పంపెయ్యడమే..” అంటూ అయన తెలిపారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed