వీడియో : తెలంగాణా ఎన్నికల ప్రచారం లో తెరాస కు ఎదురుగాలి? హనుమకొండ కెసిఆర్ సభలో ఖాళీ కుర్చీలు..

KCR Telangana Elections Campaign

KCR Telangana Elections Campaign

ముందస్తు వ్యూహంతో ప్రతిపక్షాన్ని దెబ్బకొట్టాలని ప్రయత్నించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యూహం తల్లక్రిందులైందా?ఒక ప్రక్క తెరాస అభ్యర్థుల ప్రచారం పై చాలా చోట్ల స్థానికులు వ్యతిరేకత వ్యక్తపరుస్తుండగా,తాజాగా కెసిఆర్ నిర్వహించిన హనుమకొండ సభలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం విశ్లేషకులకు షాక్ ఇచ్చింది..

ఈ సాయంత్రం జరిగిన హనుమకొండ సభలో చాలా చోట్ల ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది.. ఒక ప్రక్క ఎంపీ విశ్వేశ్వర రెడ్డి తెరాస కు రాజీనామా చెయ్యడం,మరొక ప్రక్క వరుసగా రాజీనామాలు చేస్తున్న తెరాస నాయకులు ఈ పరిణామాలు తెరాస కు ఆందోళన కలిగించే అంశమే..

అయితే కెసిఆర్ మాత్రం మహాకూటమి పై పోటీ లో తెరాస 100 నుంచి 106 సీట్లు గెలుచుకుంటుంది అని చెప్తూనే ఉన్నారు..
ఇక మహాకూటమి అభ్యర్థులు మాత్రం ప్రచారం లో దూసుకుపోతున్నారు,కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకి వివరిస్తూ వారు సాగిపోతున్నారు.. డిసెంబర్ 7 న తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి,అదే నెల 11 న ఫలితాలు వెలువడనున్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed