ఫార్మ్ హౌస్ వరకూ పరిగెత్తిస్తా: కెసిఆర్ కు బహిరంగ సభ ద్వారా హెచ్చరిక పంపిన చంద్రబాబు..

CBN Warns KCR

CBN Warns KCR

చాలా రోజుల తర్వాత కెసిఆర్ పై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో నిప్పులు చెరిగారు.. తనని జైలులో పెట్టిస్తాను అంటూ కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై చంద్రబాబు నిప్పులు తొక్కారు..

ఈరోజు ఒక బహిరంగ సభలో ప్రసంగించిన చంద్రబాబు “నన్ను జైలులో పెట్టిస్తావా కెసిఆర్,ఎవరిచ్చారు నీకు ఆ అధికారం?ఫార్మ్ హౌస్ వరకూ తరిమి కొడతాం,మళ్ళీ బయటకి కూడా రాలేవు.. పేదవాడితో మాత్రం పెట్టుకోకు,పెట్టుకొంటే నీ అంతు చూస్తాం” అంటూ హెచ్చరించారు చంద్రబాబు.

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజులుగా చంద్రబాబు టార్గెట్ గా కెసిఆర్ విమర్శలు చేస్తున్న సంగతి తెల్సిందే.. టీడీపీ ని ఆంధ్ర పార్టీ గా చూపిస్తూ,చంద్రబాబు ని బూచిగా అభివర్ణిస్తూ కెసిఆర్ ప్రసంగాలు సాగుతున్నాయి..

కెసిఆర్ విమర్శలపై చంద్రబాబు బాధ ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. తన శిష్యుడే తనపై ఇటువంటి విమర్శలు చేయడం పట్ల నిన్న అయన ఆవేదన వ్యక్తం చేసారు కూడా.. అయితే అనూహ్యంగా ఈ రోజు కెసిఆర్ కి బహిరంగ హెచ్చరిక పంపడంతో తెలుగు తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

తెలంగాణ ఎన్నికలు డిసెంబర్ 7 న జరుగనున్నాయి.. టీడీపీ,టీజీఎస్,కాంగ్రెస్ మహాకూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.. డిసెంబర్ 11 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.. ఈ ఎన్నికల ఫలితాలు టీడీపీ కి తెలంగాణా లో జీవన్మరణ సమస్య కానున్నాయి,అందుకే తమకి ఉన్న ఓట్ బ్యాంకు బలాన్ని కూడా ప్రక్కన పెట్టి టీడీపీ 14 సీట్ల తో సరిపెట్టుకొని కూటమి ఏర్పర్చుకుంది.. చూద్దాం తెలంగాణా అధికార పీఠం ఎవరిదీ కానుందో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed