అబద్ధాలు అయినా పర్లేదు,వైరల్ చేయండి.. సంచలనం సృష్టించిన భాజపా అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలు.

Amit Shah Fake News

Amit Shah Fake News

భాజపా అధ్యక్షుడు అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేసారు,ఎన్నికల్లో గెలుపు కోసం తమ సోషల్ మీడియా కార్యకర్తలకి దిశా నిర్దేశం చేస్తూ ,అబద్దపు వార్తలు వైరల్ చేయడం కూడా మంచిదే అంటూ చెప్పడమే కాకుండా,వ్యతిరేక వార్తలు రాసే పత్రికల పై ఒత్తిడి చేయాలి అంటూ ప్రసంగించారు..

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం అమిత్ షా మాట్లాడుతూ “ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మన పార్టీ గెలుపుకి ఒక కార్యకర్త సృష్టించిన నకిలీ వార్త చాలా సహాయం చేసింది,ఆ వార్త ప్రకారం నాటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ తన తండ్రి ములాయం పై దాడి చేసారు,అయితే అది నిజం కాదు,అప్పుడు ఇద్దరూ ఒకరికొకరు 600 కిలోమీటర్ల దూరం లో ఉన్నారు..

అదే విషయం ఆ పార్టీ స్పష్టం చేసింది కూడా,అయితే ప్రజల్లోకి అది బలంగా వెళ్లిపోయింది,తండ్రి మీదే దాడి చేసిన కొడుకు అని ఒక విధమైన చెడు భావన ఏర్పడింది అఖిలేష్ పై ,అది మన గెలుపు కి దోహదం చేసింది” అంటూ వ్యాఖ్యానించారు షా..

అయితే అటువంటి నకిలీ వార్తలు చేయమని తాను చెప్పటం లేదంటూనే,చేస్తే మంచిదే అంటూ ముక్తాయించారు షా.. ఇక తమకి వాట్స్ యాప్ లో ఉన్న 2 గ్రూప్లలో 32 లక్షల మంది ఉన్నారని,ఈ కార్యకర్తలు అందరూ పత్రికల్లో భాజపా పై వ్యతిరేక వార్తలపై ఆయా పత్రికల సోషల్ మీడియా లో పోరాడాలని,దానితో ఒత్తిడి తట్టుకోలేక ఆ పత్రికలు తటస్థంగా మారిపోతాయి అంటూ సెలవిచ్చారు షా..

ఈ విషయాలని పరిశీలిస్తుంటే సోషల్ మీడియా లో భాజపా కి ఉన్న ఐటి సెల్ బలం మాములుగా లేదు అనిపిస్తుంది.. అయితే సోషల్ మీడియా లో కొంత మంది మూయించవచ్చు,కాకపోతే ఓటేసే ఓటర్లను వీళ్ళు ఎలా ప్రభావితం చేయబోతారు అనేది ఆ కాలమే నిర్ణయించాలి..

2 thoughts on “అబద్ధాలు అయినా పర్లేదు,వైరల్ చేయండి.. సంచలనం సృష్టించిన భాజపా అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed