తెలుగు బాడ్మింటన్ తేజం పీవీ సింధు బయోపిక్ కి రంగం సిద్ధం చేసిన ప్రముఖ విలన్.. హీరోయిన్ ఎవరంటే..

PV Sindhu Biopic
బాడ్మింటన్ లో ఒలింపిక్ పతాకాన్ని గెలిచి,తెలుగు వారి కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపచేసిన తెలుగు తేజం పీవీ సింధు జీవిత గాధ పై బయో పిక్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది.. ఈ బయోపిక్ ని టాలీవుడ్ కి చెందిన ప్రముఖ విలన్ సోనూ సూద్ నిర్మిస్తున్నారు..
సింధు అపూర్వ విజయం పై బయోపిక్ నిర్మిస్తాను అంటూ అప్పట్లో సోనూ సూద్ ప్రకటన చేసారు.. రెండేళ్లుగా సింధు తల్లితండ్రులతో ఆయన చర్చలు జరుపుతున్నారు..అయితే సోనూ మొదట 2016 లో సింధు ఒలింపిక్ పతకం సాధించిన వరకే సినిమా తీయాలి అని మొదట అనుకున్నారట..
అయితే సింధు పలు పోటీలలో పతకాలు గెలిచి,యువతకి స్ఫూర్తి గా నిలవడంతో సోనూ ఇప్పటివరకూ 24 స్క్రిప్టులు సిద్ధం చేసినట్లు చెప్తున్నారు,అయితే ఇందులో ఏ స్క్రిప్ట్ తో సింధు బయోపిక్ ని నిర్మిస్తారో తెలియాల్సి ఉంది..
ఈ చిత్రం లో తన పాత్రలో సింధు తానే నటిస్తున్నారు,ఆమె కోచ్ గోపీచంద్ కూడా అయన పాత్రలో తానే నటిస్తున్నారు.. ఇక ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు ఎవరూ వెళ్లడి చేయలేదు సోను..దర్శకత్వం బహుశా ఆయనే వహిస్తారేమో అని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ బయోపిక్ చూడాలంటే మాత్రం 2020 వరకు ఆగాల్సిందే..
ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన సింధు,గోపీచంద్ సహకారంతో ఒలింపిక్స్ లో భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన సంగతి తెల్సిందే.. ప్రస్తుతం సింధు ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ కలెక్టర్ గా సేవలు అందిస్తున్నారు..
ఇదిలా ఉండగా బాలీవుడ్ లో బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ రూపొందుతుంది,ఈ పాత్రలో శ్రద్ధ కపూర్ నటిస్తున్నారు…