ప్రముఖ నటుడు విజయకుమార్ కి షాక్ ఇచ్చిన కుమార్తె,ఇల్లు కబ్జా..పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విజయకుమార్.

Vijayakumar Daughter Vanitha Controversy

Vijayakumar Daughter Vanitha Controversy

చూస్తుంటే ఈ 21 వ శతాబ్దంలో డబ్బుకి ఉన్న ప్రాధాన్యత కుటుంబ సంబంధాలను కూడా చంపేస్తున్నట్లు అనిపిస్తుంది,తాజాగా తమిళం,తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సీనియర్ నటుడు విజయ కుమార్ ,తన కుమార్తె వనిత తన ఇంటిని కబ్జా చేసింది అంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం సంచలనం రేపింది..

తెలుగు లో “దేవి” చిత్రంలో నటించిన వనిత,కొన్నేళ్లుగా నటన కి దూరంగా ఉంటున్నారు,అయితే ఆమె నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించారు.. అందుకోసం ఆలపక్కం(చెన్నై ) ప్రాంతంలో ఉన్న తన తండ్రి ఇంటిని ఆమె అద్దెకు తీసుకున్నారు.. అయితే ఆమె నిర్మిస్తున్న సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆమె ఇంటిని ఖాళీ చేయడానికి నిరాకరించినట్లు ఆరోపిస్తున్నారు విజయకుమార్..

ఆ ఇల్లు తనదే అంటూ,తాను ఎక్కడికీ కదిలేది లేదు అంటూ వనిత రచ్చ చేస్తున్న వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.. ఇక ఇదే విషయమై విజయకుమార్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు,తన కుమార్తె ని ఇంటి నుంచి ఖాళీ చేయించి తనకి న్యాయం చేయాలంటూ అయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం..

అయితే వనిత కి వివాదాలు క్రొత్త కాదు.. వనిత గతంలో రెండు వివాహాలు చేసుకున్నారు,అయితే ఆ రెండూ కూడా విఫలం అయ్యాయి,ఇక తన రెండో భర్త రాబర్ట్ తమ కుమార్తె ని కిడ్నాప్ చేసినట్లు ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసారు కూడా.. ఇలా చాలా విషయాలలో విజయకుమార్ కి ,అయన కుమార్తె వనిత కి విభేదాలు ఉన్నట్లు సమాచారం..

ప్రముఖ తెలుగు నటి మంజుల ని వివాహం చేసుకున్న విజయకుమార్ కి ఆరుగురు సంతానం.. వీరిలో శ్రీదేవి విజయకుమార్,వనిత విజయకుమార్,ప్రీత విజయకుమార్,అనిత విజయకుమార్,కవిత విజయకుమార్ అమ్మాయిలు కాగా.. అరుణ్ విజయ్ ఒక్కరే మగ సంతానం..

అరుణ్ విజయ్ ప్రస్తుతం తమిళ్ లో మంచి హీరో గా రాణిస్తుండగా,శ్రీదేవి ,ప్రీత 2000 వ దశకంలో “రుక్మిణి” తదితర కొన్ని తెలుగు సినిమాలలో మెరిశారు.. వనిత మాత్రం “దేవి” చిత్రం లో భానుచందర్ కి భార్య పాత్రలో నటించారు..

1 thought on “ప్రముఖ నటుడు విజయకుమార్ కి షాక్ ఇచ్చిన కుమార్తె,ఇల్లు కబ్జా..పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విజయకుమార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed