విజయ్ దేవరకొండ అభిమానులకి షాక్: టాక్సీవాలా చిత్రం థియేటర్ లో కాకుండా నేరుగా ఇంటర్నెట్ లో విడుదల? ఎందుకు??

Taxiwala Movie Internet Release
తాజాగా అందుతున్న వార్తల ప్రకారం విడుదల కి సిద్ధమైన విజయ్ దేవరకొండ తాజా చిత్రం “టాక్సీవాలా” థియేటర్ల లో కాకుండా,నేరుగా ఇంటర్నెట్ లో విడుదల చేసే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు చెప్తున్నారు.. గీత ఆర్ట్స్,ప్రభాస్ నిర్మాణ సంష్త యూవీ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ 5 నెలల క్రితమే పూర్తి అయింది..అయితే వివిధ కారణాల వల్ల చిత్ర విడుదల కి నోచుకోలేదు..
ఈ ఆగష్టు లో టాక్సీవాలా చిత్రం ఇంకా ఎడిటింగ్ కూడా పూర్తి అవ్వకుండానే,3:24 గంటల నిడివిగల చిత్రాన్ని కొంతమంది దుండగులు ఇంటర్నెట్ లో పెట్టెయ్యడం సంచలనం రేపింది.. ఈ విషయమై అప్పట్లో గుంటూరు లో కొంత మంది విద్యార్థులను,చిత్ర టీమ్ లోని కొందరినీ అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేసారు కూడా..
అయితే ఇదే విషయమై నిర్మాతలు బాగా ఆందోళన చెందారని తెల్సింది.. రెండు నెలల క్రితమే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా,విజయ్ దేవరకొండ ఇతర చిత్రాలు గీత గోవిందం,నోటా ను ముందు విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నారు విజయ్.. ఇప్పుడు తాజాగా నిర్మాతలు మాత్రం ఈ చిత్రం ఎలాగు లీక్ అయింది కనుక,థియేటర్ లో విడుదల చేసే రిస్క్ తీసుకునే కన్నా నేరుగా ఇంటర్నెట్ లో విడుదల చేయడం నయం అని తలపోస్తున్నారట..
ఈ విషయమై ఇప్పటివరకూ నిర్మాతల నుంచి అధికార ప్రకటన అయితే లేదు.. అయితే కొంత మంది మాత్రం విజయ్ కి అర్జున్ రెడ్డి,గీత గోవిందం లాంటి చిత్రాలతో మంచి మార్కెట్ ఏర్పడిందని,అయన సినిమా ఎలా ఉన్నా సరే,శ్యాటిలైట్ హక్కులు,స్ట్రీమింగ్ హక్కులు అంటూ భారీగానే లాభాలు తెచ్చుకోగలిగే అవకాశం ఉండి కూడా,నేరుగా ఇంటర్నెట్ లో ఉంచడం వల్ల ఏంటి ఉపయోగం అని ప్రశ్నిస్తున్నారు..
చూద్దాం నిర్మాతలు మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో?ఏది ఏమైనా పైరసీ భూతం మాత్రం ,సినీ పరిశ్రమ పై ఆధారపడిన ఎన్నో జీవితాలను ఛిద్రం చేసేస్తుంది అన్న మాట మాత్రం వాస్తవం..