సీనియర్ నటుడు నానా పాటేకర్ నన్ను లైంగికంగా వేధించాడు.. : బాలయ్య హీరోయిన్ తనుశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు,ఉలిక్కిపడ్డ బాలీవుడ్ ..

Tanushree Dutta Nana Patekar Controversy

Tanushree Dutta Nana Patekar Controversy

“ఆషిఖ్ బనాయా” అంటూ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మి తో చేసిన హాట్ గీతంతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని,టాలీవుడ్ లో బాలయ్య ప్రక్కన వీరభద్ర చిత్రం లో నటించిన తనుశ్రీ దత్తా కొన్నేళ్లుగా సినిమాలకి దూరమయ్యారు,అయితే హఠాత్తుగా రెండు రోజుల క్రితం మీడియా ముందు ఒక భారీ బాంబు పేల్చారు ఈ భామ..

సీనియర్ నటుడు నానా పాటేకర్ (ఈమధ్యన కాలా లో విలన్ గా నటించారు) తనతో ఒక షూటింగ్ లో అసభ్యంగా ప్రవర్తించారు అని ఆమె ఆరోపించారు.. 2009 లో హార్న్ ఓకే ప్లీజ్ అనే చిత్రం షూటింగ్ లో జరిగిన సన్నివేశాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు,ఈ సినిమాలో నిజానికి అవసరం లేకపోయినా ఒక పాటలో నానా పాటేకర్ ని బలవంతంగా చొప్పించారని,అంతే కాకుండా నానా తనని తాకుతూ స్టెప్స్ వేసేలా కావాలని ప్లాన్ చేసారు అని తనుశ్రీ ఆరోపించారు.. “అక్షయ్ కుమార్,రజనీ కాంత్ లాంటి నటులు నానా పాటేకర్ తో నటించడం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తున్నారు” అంటూ ఆమె ప్రశ్నించారు..

తనతో బలవంతంగా ఆ పాట కి స్టెప్స్ వేయించారని ఆమె ఆరోపిస్తున్నారు..ఇక ఇదే విషయమై ఆరోజు షూటింగ్ స్పాట్ లో ఉన్న ఒక విలేఖరి తాజాగా ట్విట్టర్ లో తనుశ్రీ చెప్పిన సంఘటనని ధ్రువీకరించారు.. తనుశ్రీ తో బలవంతంగా ఆ పాట చేయించడంతో ఆమె వానిటీ వ్యాన్ లోకి వెళ్ళిపోయి తలుపులు బిగించుకున్నారని,ఆమెను ఆ వ్యాన్ లోంచి బయటకి తీసుకురావడానికి గుండాలని కూడా ప్రయోగించారని ఆ విలేఖరి తెలిపారు..

అయినా కూడా ఆమె బయటకి రాకపోవడంతో చివరికి ఆమె తల్లితండ్రులు వచ్చి,ఆమెను బయటకి తీసుకువచ్చారు అని తెలిపారు ఆ విలేఖరి..

ఈ సంఘటన 2009 లో జరుగగా,అప్పట్లో ఈ సంఘటన ను నానా “ఆమె నా కూతురు లాంటిది” అంటూ కొట్టి పారేసారు.తాజాగా ఈ విషయమై స్పందించిన నానా ఒక టీవీ ఛానెల్ తో ఫోన్ లో మాట్లాడుతూ “లైంగిక వేధింపులా? ఆ సెట్ లో 50 మంది ఉన్నారు.. ” అంటూ నవ్వేశారు.. ఈ విషయంపై తాను ఇంక మాట్లాడబోను ,నా పని నేను చూసుకుంటా అంటూ స్పందించారు నానా..

ఇప్పుడు తాజాగా తనుశ్రీ ఈ అంశం తెరపైకి తీసుకురావడంతో బాలీవుడ్ లో మినీ సునామీ ఏర్పడింది… కాస్టింగ్ కౌచ్,మీ టూ పేర్లతో ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో తనుశ్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి..

తాజాగా తనుశ్రీ వ్యాఖ్యలను దర్శకుడు,నృత్య దర్శకుడు ఖండించగా.. ఒక కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ ” ఈ విషయం పై స్పందించడానికి తాను నానా పాటేకర్ కానీ,తనుశ్రీ ని కానీ కాను ” అంటూ వ్యాఖ్యానించడానికి నిరాకరించారు..

ఇక “నిజానిజాలు తెలియకుండా తాను ఈ విషయం గురించి మాట్లాడను,కాకపోతే ఇలాంటి సంఘటనలు నిజంగా జరిగుంటే మాత్రం దురదృష్టకరం.. విచారణ జరుగనివ్వండి” అంటూ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ వ్యాఖ్యానించారు…

నిజానికి తనుశ్రీ కొన్నేళ్లుగా వెండితెర కి దూరంగా ఉన్నారు,అయితే తన అదృశ్యం వెనుక నానా పాటేకర్ ఉన్నారు ,అలాంటి నటుల్ని బహిష్కరించాలని నినదిస్తున్నారు తనుశ్రీ..

3 thoughts on “సీనియర్ నటుడు నానా పాటేకర్ నన్ను లైంగికంగా వేధించాడు.. : బాలయ్య హీరోయిన్ తనుశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు,ఉలిక్కిపడ్డ బాలీవుడ్ ..

  1. Aw, this was an incredibly good post. Spending some time and actual effort to produce a
    really good article… but what can I say… I procrastinate a lot and don’t manage to get nearly
    anything done.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed