హీరోయిన్ రష్మిక మందన్న ప్రేమ వివాహం రద్దు వెనుక విజయ్ దేవరకొండ ఉన్నారా? అయన ఏమన్నారంటే..

Rashmika Mandanna Breakup

Rashmika Mandanna Breakup

ఈమధ్యన టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక,కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో నిశ్చితార్ధం కూడా అయ్యాకా తన ప్రేమ వివాహాన్ని రద్దు చేసుకున్న సంగతి తెల్సిందే..

అయితే ఈ వివాహం రద్దు వెనుక విజయ్ దేవరకొండ ఉన్నారంటూ వార్తలు వెలువడ్డాయి,విజయ్ తో ఆమె “గీతా గోవిందం”అనే చిత్రం లో చేసిన లిప్ లాక్ సన్నివేశాలు ,వీరి ప్రేమ బంధంలో చీలికలు తేవడంతో,వీరి వివాహం రద్దయింది అంటూ చెప్పుకున్నారు..

అయితే ఇదే విషయమై నోటా ప్రమోషన్ల లో బిజీ గా ఉన్న విజయ్ దేవరకొండ ని విలేఖరులు ప్రశ్నించగా అయన ఆసక్తికరంగా స్పందించారు..తాను కేవలం ఆమె సహనటుడిని అని,వారి బంధంలో తాను మూడో వ్యక్తిని మాత్రమే అంటూ స్పందించారు విజయ్..

“అలంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధ కలిగిస్తుందో నాకు తెల్సు,అయితే ఇది జీవితం.. వారు పరిస్థితులకు అనుకూలంగా వెళ్లారు…” అంటూ ఆ టాపిక్ ని అక్కడితో ముగించారు విజయ్..

ఇక విజయ్ నటించిన నోటా ఈరోజు విడుదలైంది.. చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది అని సమాచారం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed