మొన్న అనుపమ పరమేశ్వరన్,నేడు హాస్య నటుడు సప్తగిరి పై షూటింగ్ లో ప్రకాష్ రాజ్ చేయి చేసుకున్నారా? అసలు సంగతి ఏంటి??

Prakash Raj Saptagiri Controversy

Prakash Raj Saptagiri Controversy

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.. తాజాగా వైరల్ అవుతున్న వార్త ప్రకారం హలో గురు ప్రేమ కోసమే సినిమా షూటింగ్ లో నటుడు సప్తగిరి పై చేయి చేసుకున్నారు అని చెప్తున్నారు..

డెక్కన్ క్రానికల్ ప్రచురించిన ఒక కథనం ప్రకారం ఆ సంఘటన రామోజీ ఫిలిం సిటీ లో వేసిన రైల్వే స్టేషన్ సెట్ లో చోటు చేసుకుంది..100 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్న ఆ షూటింగ్లో హఠాత్తుగా ప్రకాష్ రాజ్ సప్తగిరి పై చేయి చేసుకున్నారు.. ఈ హఠాత్ పరిణామం పై ఒక్కసారిగా అక్కడున్న వారు షాక్ అయ్యారు.అయితే ప్రకాష్ రాజ్ కోపానికి కారణం తెలియరాలేదు..
ఇక ఈ సంఘటన పై ఎవరూ స్పందించవద్దు అని నిర్మాత దిల్ రాజు ఆదేశించారు అని చెపుతున్నారు..ఇక ఇదే విషయంపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ అటువంటి సంఘటన ఏమి జరగలేదు అంటూ వివరించారు..

“ఇది వట్టి పుకారు..సప్తగిరి పై చేయి చేసుకోవాల్సిన అవసరం నాకేమి ఉంది?అతను మంచి నటుడు,దర్శకుడిగా కూడా నిరూపించుకున్న సందర్భంగా నేను అతనికి శుభాకాంక్షలు తెలిపాను.. అతనితో ముందు ముందు కూడా నటిస్తా ” అని తెలిపారు ప్రకాష్ రాజ్ ..

ఇక గతంలో అనుపమ పరమేశ్వరన్ తో వివాదం పై కూడా ప్రకాష్ రాజ్ స్పందిస్తూ “ఆమెతో నాకు ఎటువంటి విభేదాలు లేవు,ఆమె నటన ను మెరుగు పరుచుకోవడానికి నేను కొన్ని సలహాలు ఇచ్చాను,అయితే ఆరోజు ఆమె అనారోగ్యంగా ఉండటం తో ఎమోషనల్ అయ్యారు.. ఆ తరువాత ఆమె మాకు ఎటువంటి విభేదాలు లేవు అని తెలిపారు ప్రకాష్ రాజ్ ..

అయితే ఇదే విషయంపై సప్తగిరి తెలుసుకోవడానికి ప్రయత్నించగా ,అయన మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లు సమాచారం.. ఇక ఇదే విషయం పై దర్శకుడు త్రినాథ రావు నక్కిన స్పందిస్తూ సంఘటన జరిగిన స్థలంలో తాను లేను అని చెప్పారు తప్ప,ఈ సంఘటన ను ఖండించకపోవడం పై ఆసక్తికర చర్చ నడుస్తుంది..

ఇక ప్రకాష్ రాజ్ కి వివాదాలు కొత్త కాదు,గతంలో మహేష్ బాబు ఆగడు సినిమా షూటింగ్ లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పై చేయి చేసుకున్న సంఘటన కలకలం రేపింది. ఆ సందర్భంగా ప్రకాష్ రాజ్ పై కొన్నాళ్ళు తెలుగు చలన చిత్రం లో నిషేధం విధించారు..

1 thought on “మొన్న అనుపమ పరమేశ్వరన్,నేడు హాస్య నటుడు సప్తగిరి పై షూటింగ్ లో ప్రకాష్ రాజ్ చేయి చేసుకున్నారా? అసలు సంగతి ఏంటి??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed