యంగ్ రెబెల్ స్టార్ అభిమానులకి స్వీట్ న్యూస్ ,ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ,అధికారిక ప్రకటన ఎప్పుడంటే..

Prabhas Marriage News

Prabhas Marriage News

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ఎవరంటే ముందు వరుసలో చెప్పే పేరు బాహుబలి ప్రభాస్,ఇంకో రెండేళ్లలో 40 కి చేరువవుతున్న ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనేది పెద్ద సస్పెన్స్ కాగా,ఈ సస్పెన్స్ కి కొద్దిరోజుల్లో తెరపడనున్నట్లు గా తెలుస్తుంది..

ప్రముఖ గాసిప్ వెబ్ సైట్ లు ప్రచురిస్తున్న కథనాల ప్రకారం ప్రభాస్ పెళ్లి గురించిన ప్రకటన వచ్చే నెల,అంటే అయన పుట్టినరోజైన అక్టోబర్ 23 న ఉండబోతుంది అని చెపుతున్నారు..ప్రభాస్ బాధ్యతలు చూస్తున్న అయన పెదనాన్న కృష్ణం రాజు కూడా ఈ విషయమై ప్రభాస్ ని ఒత్తిడి చేస్తున్నారు అని సమాచారం..

తన వయభారం వల్ల ప్రభాస్ పెళ్లి అనే బాధ్యత తీర్చుకోవాలని కృష్ణంరాజు భావిస్తున్నారు..పెళ్లి ప్రకటన 23 నే అయినా,పెళ్లి మాత్రం ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “సాహో” విడుదల తర్వాతే ,అంటే 2019 వేసవిలో ఉండవచ్చు అని సమాచారం..

అప్పట్లో ప్రభాస్- అనుష్క ప్రేమలో ఉన్నారు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా వార్తలు వచ్చాయి,అయితే అదంతా ఒట్టిదే ,మేము కేవలం స్నేహితులం మాత్రమే అని వీరిద్దరూ స్పష్టత ఇచ్చారు..

బాహుబలి 1,2 విడుదల అయ్యాక ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ ని దాటి,బాలీవుడ్ కి ,అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయి కూడా చేరిన సంగతి విదితమే..మరి ఈ బాహుబలి ని చేసుకునే ఆ దేవసేన ఎవరో తెలుసుకోవాలంటే ఇంకో 25 రోజులు ఆగాల్సిందే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed