“నయన్ తో పెళ్లా? నన్ను అడగొద్దు”, నయనతార తో వివాహం పై ఆమె ప్రియుడు విగ్నేష్ శివన్ హాట్ కామెంట్స్..

Nayanthara Vignesh Shivan Marriage

Nayanthara Vignesh Shivan Marriage

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ నటి నయనతార,ఇప్పుడు మట్టి పట్టుకున్నా బంగారంగా మారిపోతుంది..కేవలం ఆమె నటిస్తే చాలు,ప్రతి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తుంది నిర్మాతలకి ఈమధ్యన.. అయితే ఇదంతా ఆమె వృత్తిగతం,వ్యక్తిగత జీవితం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది..

నయనతార గతంలో మొదట నటుడు శింబు ,ఆ తర్వాత డాన్సర్ ప్రభుదేవా తో ప్రేమ వ్యవహారం నడిపిన సంగతి తెల్సిందే. శింబు తో వ్యవహారం ప్రేమ దగ్గరే ఆగిపోగా,ప్రభుదేవా తో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది,ఇలా రెండు ప్రేమ వ్యవహారాలు ఆమెకు అచ్చి రాలేదు..

ఇక ప్రస్తుతం ఆమె దర్శకుడు విఘ్నేష్ శివన్ తో డేట్ లో ఉంది… గత మూడేళ్ళుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.. తాజాగా వీరిద్దరూ పంజాబ్ లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా నయన్ తో పెళ్లి గురించి విలేఖరుల దగ్గర విఘ్నేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు చెప్తున్నారు..

“నయనతారతో ప్రేమలో ఉన్నారా ? పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు” అనే ప్రశ్నకి విఘ్నేష్ “దానికి నాదగ్గర సమాధానం లేదు ఎందుకంటే నయనతార ఈ విషయం చెప్పాలి అలాగే మా అమ్మగారు అనుమతి ఇవ్వాలి” అంటూ షాక్ ఇచ్చారు..

అయితే గత మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్న ఈ జంటకి ,తల్లిదండ్రుల అనుమతి తోనే ఇదంతా చేస్తున్నారా అనే సందేహం వస్తుంది అభిమానులకి..నయనతార పాపం మొదటి ప్రేమ వ్యవహారంలో శింబు చేతిలో మోసపోగా,రెండో ప్రేమ వ్యవహారంలో రెండో పెళ్లి చేసుకుంటాను అని మాట ఇచ్చి మరీ ప్రభుదేవా నయన్ కి షాక్ ఇచ్చారు.. ఇక మరోసారి నయన్ కి అలంటి చేదు అనుభవం ఎదురుకాకూడదు అని కోరుకుంటున్నారు అభిమానులు..

విఘ్నేష్ దర్శకత్వం వహించిన చిత్రాలు “నేను రౌడీ నే” ,”గ్యాంగ్(సూర్య)” పేర్లతో తెలుగులో విడుదలయ్యాయి.. నేను రౌడీ నే సమయంలోనే విఘ్నేష్-నయన్ ల ప్రేమ చిగురించింది అని చెప్పుకుంటారు.. వీరి ప్రేమ కథ,పెళ్లి పీటల వరకు వెళ్లాలని ఆశిద్దాం..

1 thought on ““నయన్ తో పెళ్లా? నన్ను అడగొద్దు”, నయనతార తో వివాహం పై ఆమె ప్రియుడు విగ్నేష్ శివన్ హాట్ కామెంట్స్..

 1. Hey guys, my name is Pola!

  I`m an academic writer and I`m going to change your lifes onсe and for all
  Writing has been my passion for a long time and now I can`t imagine my life without it.
  Most of my poems were sold throughout Canada, USA, Old England and even India. Also I`m working with services that help people to save their time.
  People ask me “Mr, Pola, I need your professional help” and I always accept the request, `cause I know, that only I can save their time!

  Professional Writer – Pola Cassidy – Keithekiss Confederation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed