వీడియో : అల్లరి నరేష్ ని ర్యాగింగ్ చేస్తూ మహేష్ బాబు.. మహర్షి చిత్రం లో వీడియో లీక్,వైరల్..

Maharshi Leaked Video
ఈ మధ్య నిర్మాణం జరుపుకుంటున్న చిత్రాలకి లీకుల బాధ తప్పటం లేదు.. కొన్నేళ్ల క్రితం అత్తారింటికి దారేది తో మొదలెట్టి,బాహుబలి ఇంకా గీత గోవిందం ఇలా ప్రతి చిత్రం విడుదల కి ముందే కీలక సన్నివేశాలు లీక్ అవ్వడం నిర్మాతలకి ఆందోళన కలిగిస్తుంది.. తాజాగా ఈ లీకుల జాబితాలో ప్రిన్స్ మహేష్ “మహర్షి” చిత్రం కూడా చేరింది..
మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న మహర్షి చిత్రం లో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెల్సిందే.. తాజాగా ఈ చిత్రంలో మహేష్ ,అల్లరి నరేష్ ని ర్యాగింగ్ చేస్తున్న వీడియో క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..
ఈ వీడియో క్లిప్ నిజానికి సెట్ లో అల్లరి నరేష్ పుట్టినరోజు వేడుక సందర్భంగా తీసింది అని అభిమానులు చెప్తున్నా,అల్లరి నరేష్ పుట్టినరోజు జులై లో ,ఈ వీడియో మాత్రం ఈ మధ్యనే తీసింది కాబట్టి ఇది సినిమా లో సన్నివేశమే అని అనుకుంటున్నారు..
Allari naresh bday celebration ankunta @urstrulyMahesh 😂😂😂
Witty pic.twitter.com/XSD5Ay3tAT— Vivek (@sai__vivek) September 14, 2018
ఇక ఈ వీడియో లో మాటలు ఏమి వినపడకపోయినా మహేష్ ,నరేష్ భుజం పై చెయ్యి వేసి,తన మిత్రబృందం తో కలిసి ఆయన్ని టీజ్ చేస్తూ కనిపిస్తారు.. కాలేజీ నేపథ్యంలో నడిచే ఈ సన్నివేశాల్లో మహేష్ ధనిక విధ్యార్ధి గా ,నరేష్ బీద విధ్యార్ధి గా కనిపించబోతున్నట్లు సమాచారం..
మొదట్లో అల్లరి నరేష్ పాత్ర చాలా తక్కువగా ఉంటుంది అని భావించిన,ఇప్పుడు నరేష్ ఈ చిత్రం కోసం 140 రోజులు షూటింగ్ లో పాల్గొన్నుట్లు తెల్సింది.. వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న మహర్షి చిత్రం లో పూజా హెగ్డే కథానాయిక గా నటిస్తున్నారు.. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి బరిలో విడుదల కాబోతుంది..