పెళ్లి పీటలు ఎక్కనున్న సీనియర్ హీరో వెంకటేష్ కుమార్తె ఆశ్రిత? వరుడు ఎవరంటే..

Hero Venaktesh's Daughter Marriage

Hero Venaktesh Daughter Marriage

ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ పెద్దకుమార్తె ఆశ్రిత దగ్గుబాటి త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు వెబ్ మీడియా లో వార్తలు వెలువడుతున్నాయి.. డెక్కన్ క్రానికల్ ఆశ్రిత ది పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అని చెప్పింది..

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం హైదరాబాద్ రేస్ క్లబ్ కి చెందిన సురేందర్ రెడ్డి మనువడు తో ఆశ్రిత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నారు..ఇదే విషయమై వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు ,సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చారట..

ప్రస్తుతం వెంకటేష్ F2 సినిమా చిత్రీకరణలో భాగంగా విదేశాల్లో ఉన్నారు,అయన స్వదేశానికి తిరిగొచ్చాక నిశ్చితార్ధం ఉండొచ్చు,అని ఆ కధనం వెల్లడించింది.. ఆశ్రిత ప్రస్తుతం ప్రొఫెషనల్ బేకర్ గా ఉన్నారు.. రామానాయుడు స్టూడియో లో ప్రస్తుతం ఆమె కుకీస్ కోసం ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేసారు..


ఇక వరుడి తండ్రి రఘురామి రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి స్నేహితుడు అని చెప్తున్నారు..వెంకటేష్ కి ముగ్గురు కుమార్తెలు – ఆశ్రిత,హవ్య,భావన ఒక కుమారుడు – అర్జున్ ,వీరిలో అందరికన్నా తనకి ఆశ్రిత అంటేనే ఎక్కువ ఇష్టం అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు వెంకీ..

“చెప్తే కొడతారు ఏమో అందరికన్నా నాకు ఆశ్రిత అంటేనే ఇష్టం.. తాను నన్ను మనిషిగా చాలా మార్చింది,తన వల్లే నేను ఈరోజు మరొక విధంగా ఉన్నాను,అదృష్టవశాత్తూ నా మిగిలిన పిల్లలు కూడా అలానే ఉన్నారు” అంటూ చెప్పారు వెంకీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed