ఆ తమిళ హీరో ని అమలా పాల్ రెండో పెళ్లి చేసుకోనున్నారా ? క్లారిటీ ఇచ్చిన నటుడు విష్ణు విశాల్..

Amala Paul Vishnu Vishal

Amala Paul Vishnu Vishal

ప్రముఖ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో మలయాళీ ముద్దుగుమ్మ అమలా పాల్ మొదటి వివాహం విఫలమైన సంగతి తెల్సిందే..ఆ తర్వాత సినిమాలతో బిజీ అయిపోయిన అమలా తాజాగా ఒక ఇంటర్వ్యూ తాను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పారు.. అయితే తాజాగా ఆమె సహనటుడు విష్ణు విశాల్ ని పెళ్లాడనున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి..

ఈ నేపథ్యంలో అమల పాల్ తో తన వివాహం అంటూ రాసిన ఒక వెబ్ సైట్ పై నటుడు విష్ణు విశాల్ విరుచుకుపడ్డారు.. “ఇలాంటి మ‌తిలేని వార్త‌లు రాయొద్దు. కొంచెం బాధ్య‌త‌గా ప్ర‌వ‌ర్తించండి. మేం మ‌నుషుల‌మే, మాకు కూడా కుటుంబాలుంటాయి. ఇలాంటి నిరాధ‌ర వార్త‌లు ప్ర‌చురించి బాధ క‌లిగించొద్దు” అంటూ పోస్ట్ చేసారు విష్ణు విశాల్..

ఇక విష్ణు విశాల్ కూడా విడాకులు తీసుకున్నవారే,తన భార్య రజని తో తాను ఒక ఏడాదిగా విడిగా ఉంటున్నాను అని,ఈమధ్యనే విడాకులు కూడా అయ్యాయి అని తెలిపారు.. వీరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు.. విడిపోయినా కూడా తాము స్నేహితుల్లాగానే ఉంటాము అని తెలిపారు విశాల్..

ఈ వార్తలపై అమలా పాల్ స్పందించలేదు.. ఈమధ్యన అమలా పాల్,విష్ణు విశాల్ నటించిన రాత్ససన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed