జాక్ పాట్ కొట్టిన అల్లు శిరీష్ అభిమాని: సోషల్ మీడియా లో లాప్ టాప్ అడిగితె, అల్లు శిరీష్ సంతోషంగా తీసుకోమన్నాడు..కథ ఏంటంటే..

Allu Sirish Laptop Gift Fan

Allu Sirish Laptop Gift Fan

తాను సినిమాల్లోనే కాదు,నిజ జీవితంలో కూడా హీరోనే అంటూ నిరూపించుకున్నారు నటుడు అల్లు శిరీష్.. సోషల్ మీడియా లో ఒక అభిమాని తనకి ల్యాప్ టాప్ కావాలని అడగడంతో తీసుకోమంటూ ఆఫర్ ఇచ్చేసాడు..

అసలు సంగతి ఏంటంటే,అల్లు శిరీష్ అన్న, అల్లు అర్జున్ ఈ మధ్యనే శిరీష్ కి ఒక మ్యాక్ బుక్ కొనిచ్చారట..ఈ సందర్భంగా ఆ సంతోషాన్ని సోషల్ మీడియా లో పంచుకున్న శిరీష్ “20 ఏళ్ళ నుంచి విండోస్ వాడుతున్న నేను ఇపుడు మ్యాక్ కి షిఫ్ట్ అయ్యా,స్కూల్ లో ఉన్నప్పుడు బెంక్యూ జాయ్ బుక్ నుంచి ఇప్పటి వరకూ ల్యాప్ టాప్ లు ఇస్తూనే ఉన్నావ్ నాకు ,నీ కనుక కి థాంక్స్ అన్నా” అంతో పోస్ట్ చేసారు..

ఇక ఈ ట్వీట్ కి రిప్లై పెట్టిన ఒక అభిమాని “అన్నా నాకు కూడా ఒక చిన్న ల్యాప్ టాప్ గిఫ్ట్ గా ఇవ్వన్నా,నేను కొనాలి అంటే ఇంకో 3 ఏళ్ళు పట్టుద్ది,నాకు ఫామిలీ ఉంది,ల్యాప్ టాప్ అవసరం చాలా ఎక్కువ,నాకు ల్యాప్ టాప్ లేదు.. నేను నీకు అల్లు అర్జున్ కి అభిమానిని ” అంటూ పోస్ట్ పెట్టాడు ఒక అభిమాని..

ఈ పోస్ట్ పై కరిగిపోయిన శిరీష్ స్పందిస్తూ “అయ్యో,దిగులుపడకు బ్రదర్,నువ్వు సంపాదించి,నీ కుటుంబాన్ని పోషించు.. నా దగ్గర కొత్త ల్యాప్ టాప్ ఉంది కనుక,నా పాత ల్యాప్ టాప్ సోనీ వాయో నువ్వు తీసుకో,వివరాల కోసం నాకు మెసేజ్ పెట్టు” అంటూ పోస్ట్ చేసాడు..

అల్లు శిరీష్ మంచితనం పై సోషల్ మీడియా లో ప్రశంశలజల్లు కురిసింది,కొందరు మాత్రం సరదాగా అల్లు అర్జున్ వాడే కార్లు కావాలి,అంటూ పోస్ట్ పెట్టారు.. అల్లు శిరీష్ తాజగా ABCD అనే చిత్రం లో నటిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed