నటుడు శ్రీనివాస రెడ్డి కి షాక్ ఇచ్చిన ఫేస్ బుక్ మోసగాడు.. కథలు వింటా,ఫోటోలు చూస్తా అంటూ నకిలీ అకౌంట్,డబ్బుల వసూలు కూడా..

Actor Srinivasa Reddy Controversy

Actor Srinivasa Reddy Controversy

ప్రముఖ టాలీవుడ్ హాస్యనటుడు శ్రీనివాస రెడ్డి కి ఒక నకిలీ ఫేస్ బుక్ యూజర్ షాక్ ఇచ్చాడు.. శ్రీనివాస రెడ్డి పేరుతొ ఫేస్ బుక్ ఖాతా సృష్టించి,కథలు వింటా,ఫోటోలు పంపండి అంటూ అందరితో ఛాట్ చెయ్యడం ప్రారంభించాడు ఒక కేటుగాడు..

ఈ విషయం శ్రీనివాస రెడ్డి కి తెలియడం తో ఆయన సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసారు.. ఇదే విషయాన్నీ ఆయన సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకున్నారు శ్రీనివాసరెడ్డి

“Hello Friends
నా Name మీద ఒక fake facebook account open చేసి అందరితో chat చేస్తు
Photos పంపమని, stories పంపమని, keralaకి funds కూడా వసూలు చేస్తున్నాడు.
ఆ విషయం నా దృష్టికి వచ్చి నేను cyber crimeలో complaint చేస్తే
ఆ account close చేసారు
క్రింద photoలో నా పక్కన ఉన్న వ్యక్తి “Srinivas గారు S.I CYBER CRIME” ఆయన గారి సహకారంతో ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది.
ఇంకో photo fake Facebook accountది
ఈ fake Facebook account వల్ల జరిగిన అసౌకర్యానికి SORRY 🙏🏼” అంటూ పోస్ట్ చేసారు..

ఇక ఇంత రచ్చ చేసిన రవికిరణ్ అనే ఆ కేటుగాడు గతంలో అనేక మంది హీరోల వద్ద అసిస్టెంట్ గా చేసాడని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.. ఆ పరిచయాలను అడ్డంపెట్టుకొని నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీలను సృష్టించేవాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, మంచి కథలు ఉంటే పంపాలని పలువురితో చాటింగ్‌ చేస్తున్నాడు.

శ్రీనివాస రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు పై రంగంలో దిగిన పోలీసులు నిందితుడు రవికిరణ్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు నిందితునికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించి పంపారు.

కాబట్టి ఈ సైబర్ ప్రపంచంలో నిరంతరం అప్రమత్తంగా ఉండటం అవసరం,మన అభిమాన నటులు మనతో తమ భావాలు పంచుకోవటానికి సోషల్ మీడియా తప్ప,మనల్ని డబ్బులు లేదా మరేవిధమయిన ప్రయోజనాలైనా అడుగుతున్నారంటే ఆ అకౌంట్స్ కి దూరం గా ఉండటం శ్రేయస్కరం.. చేతులు కాలాకా ఆకులు కట్టుకుని ఏమి ప్రయోజనం?

1 thought on “నటుడు శ్రీనివాస రెడ్డి కి షాక్ ఇచ్చిన ఫేస్ బుక్ మోసగాడు.. కథలు వింటా,ఫోటోలు చూస్తా అంటూ నకిలీ అకౌంట్,డబ్బుల వసూలు కూడా..

  1. Have you ever thought about writing an e-book or guest authoring on other blogs?
    I have a blog based on the same topics you discuss and
    would love to have you share some stories/information. I know my audience would value your work.
    If you are even remotely interested, feel free to send me an e mail.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed