ప్రధాని మోడీ కి ఒకే రోజు రెండు షాకులు,రాజీనామాలు సమర్పించిన ఆర్ బీ ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్,కేంద్ర మంత్రి కుష్వాహా

Urjit Patel RBI Resignation

Urjit Patel RBI Resignation

రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఏమి అవుతాయో,తెలియని సందిగ్ధంలో ఉన్న ప్రధాని మోడీ కి ఈరోజు రెండు భారీ షాకులు తగిలాయి.. దేశ అత్యున్నత బ్యాంకు రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా ఒక ప్రక్క,మరొక ప్రక్క కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా రాజీనామా భాజపా ని ఉక్కిరి బిక్కిరి చేసాయి..

మొదట ఈ ఉదయం కేంద్ర మంత్రి పదవి కి ఉపేంద్ర కుష్వాహా ప్రధాని పై నిప్పులు చెరిగారు.. అమిత్ షా, మోడీ తీసుకున్న నిర్ణయాలను ఏ మాత్రం ఆలోచించ కుండా కళ్లుమూసుకుని స్టాంప్ వేయటం తప్ప… కేంద్ర మంత్రివర్గం ఏమి చేయటం లేదని ఆరోపించారు..

మంత్రులు, అధికారులు ఏమి చేతకాని వారుగా మారిపోయారని ఆరోపించారు. మోడీ, పీఎంఓ, అమిత్ షా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారని ఉపేంద్ర పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు కుష్వాహా ప్రకటించారు..

బీహార్ కి చెందిన కుష్వాహా తన రాష్ట్రానికి అన్యాయం జరిగినట్లు ఆరోపించారు.. “మీరు ఎన్నో హామీలు ఇచ్చారు,వాటిలో కొన్ని కూడా నిలబెట్టుకోలేదు,ముఖ్యంగా బీహార్ కి ప్రత్యేక ప్యాకేజి పెద్ద జూమ్లా గా మారిపోయింది” అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు కుష్వాహా..

కుష్వాహా ఇచ్చిన షాక్ నుంచి తేరుకునే లోపే ఈ సాయంత్రం ఆర్ బీ ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన రాజీనామా తో వార్తల్లోకి ఎక్కారు.. తన లేఖలో వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసాను అని చెప్తున్నా,పెద్ద నోట్ల రద్దు,ఇంకా ఆర్ బీ ఐ- ప్రభుత్వానికి మధ్య కొన్ని అంశాల్లో కొద్దీ రోజులుగా జరుగుతున్న ఘర్షణ నేపథ్యంలోనే ఈ రాజీనామా వెలువడింది అని విమర్శకుల విశ్లేషణ..

ఆర్బీఐకి చెందిన నిధులను ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న అంశంపై ఉర్జిత్ ప్రభుత్వంతో తీవ్రంగా విభేదించారు. అలాగే ఎన్‌బీఎఫ్‌సీలకు  బ్యాంకులకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలన్న ప్రభుత్వ వాదనతో ఆయన విభేదించారు. 

కొద్దీ రోజులుగా ప్రధాని మోడీ నిర్ణయాలపై విమర్శలు పెరుగుతున్న సంగతి తెల్సిందే.. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి,ఇక రాఫెల్ కుంభకోణం,సిబిఐ వ్యవహారం ప్రస్తుత ప్రభుత్వానికి తలనొప్పులుగా పరిణమించాయి..

ఇక ఇదే రోజు ఢిల్లీలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో భాజపాయేతర కూటమి సమావేశం జరిగింది.. ఏది ఏమైనా 2019 ఎన్నికలలో మోడీ గెలుపు 2014 అంత సులభం కాదనేది సుస్పష్టం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed