నోటా ప్లాప్:ఒక్క సినిమా తో అయిపోలేదు,నువ్వే ప్రపంచం కాదు .. విజయ్ దేవరకొండ వర్సెస్ నిఖిల్ మాటల యుద్ధం..

Vijay Deverakonda Vs Nikhil Comments

Vijay Deverakonda Vs Nikhil Comments

అర్జున్ రెడ్డి,గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్స్ తో మంచి జోష్ మీదున్న విజయ్ దేవరకొండ విజయ పరంపర కి, గతవారం అనేక అంచనాల మధ్యన విడుదలైన నోటా ప్లాప్ కళ్లెం వేసిన సంగతి తెల్సిందే..

అయితే తాజాగా విజయ్ నోటా ప్లాప్ పై స్పందించారు.. ఒక్క సినిమాతో అంతా అయిపోలేదు రౌడీస్ అంటూ తన స్టైల్ లో సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ఉంచారు,ఇక ఇదే విషయమై మరొక యువ నటుడు నిఖిల్ కూడా నర్మగర్భంగా స్పందించారు.. నీ చుట్టూ ప్రపంచం తిరగడం లేదు,అంటూ ఘాటుగానే వాత పెట్టారు నిఖిల్ విజయ్ కి..

గత రాత్రి విజయ్ ఫేస్ బుక్ లోఉంచిన పోస్ట్ లో ఏమన్నారంటే. “నా పైన ప్రేమతో సినిమాకి వెళ్ళేవాళ్ళకి,ఇతరులు ఓడిపోతే సంబరాలు చేసుకునే వారికి… నేను సాకులు చెప్పను,బాధ్యత తీసుకుంటా.. నేను నోటా సినిమా చేసినందుకు గర్వపడుతున్న,అది నేను చెప్పాలనుకున్న కథ,నేను అనుకున్నట్లుగా నటన ను పండించిన చిత్రం..

తమిళనాడు,జాతీయ మీడియా,ఇక్కడ నా సినిమా ను ఆదరించిన ప్రేక్షకులందరి ప్రేమను నేను తీసుకున్నా.. మీ నిరాశ,విమర్శలు కూడా నేను తీసుకున్నా,నా వైపు ఉన్న తప్పులను సవరించుకుంటా,నా నిర్ణయాలను కూడా మార్చుకుంటా,అయితే నా స్వభావాన్ని,శ్రమతత్వాన్ని మాత్రం మార్చుకోను.

విజయం లేదా అపజయం ఒక రౌడీ ని మార్చలేదు,అయితే నువ్వు ఎప్పుడైతే ఆగిపోతావో,ఓటమి ని అంగీకరిస్తావో అప్పుడే నువ్వు ఓడినట్లు.. అయితే రౌడీ గా ఉండటం అంటే గెలవటం కాదు ,గెలుపు కోసం చేసే పోరాటం.. మనలో రగిలే జ్వాల అది.. కాబట్టి రౌడీలూ గర్వపడండి,పోరాడండి,గెలిస్తే గెలుస్తాం,లేదంటే నేర్చుకుంటాం..
ఈ నా ఓటమిని వేడుకగా జరుపుకుంటున్న వారందరూ పండగ చేస్కోండి.. నేను మళ్ళీ వస్తా.. మీ రౌడీ విజయ్ దేవరకొండ” అంటూ పోస్ట్ పెట్టారు విజయ్ ..

అయితే విజయ్ ఈ వ్యాఖ్యలపై యువ నటుడు నిఖిల్ స్పందించారు,విజయ్ పేరు నేరుగా చెప్పకుండా నిఖిల్ ఈ వ్యాఖ్యలు చేసారు..”ప్రపంచం మొత్తం తమ చుట్టూ తిరుగుతుంది అని నమ్ముతూ,అనవసరమైన యాటిట్యూడ్ చూపించే వారికి,భయ్యా నువ్వు అంత ముఖ్యమైన వాడివి ఏమీ కాదు.

ప్రతి నటుడు తనతో మాత్రమే తాను పోటీ పడాల్సి ఉంటుంది.. సినీ ప్రపంచం అనే మహా సముద్రంలో మనం కేవలం ఒక నీటి చుక్క .. హైప్ తగ్గించి,శ్రమించు ” అంటూ ఘాటు ట్వీట్ పెట్టారు నిఖిల్..

అయితే నిఖిల్ ట్వీట్ పై విజయ్ అభిమానులు మండిపడుతున్నారు.. విజయ్ ఎదుగుదల చూసి ఓర్వలేని నిఖిల్ ఈ విధంగా ట్వీట్ పెట్టారని కామెంట్స్ పెడుతున్నారు.. మరొక ప్రక్క విజయ్ అతిని భరించలేని ప్రేక్షకులు మాత్రం నిఖిల్ ని సమర్థిస్తున్నారు..
ఇక ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ నిఖిల్ మాత్రం అనూహ్యంగా తన ట్వీట్ ని తొలగించారు.. “నా మునుపటి ట్వీట్ ని తొలగిస్తున్నా,ఎందుకంటే అది ఎవరినీ ఉద్దేశించింది కాదు .. ఏ విషయాన్నీ అయినా వారికి నచ్చినట్లుగా తిప్పేసేవారు ఉన్నారని నాకు అర్ధమైంది.. అయితే ట్విట్టర్ సరదా అయిందే” అంటూ ట్వీట్ ని ఉంచారు నిఖిల్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed