మీరు నా అభిమానులు అయితే అలాంటి పనులు చేయకండి.. సోషల్ మీడియా లో అభిమానులకి క్రొత్త రూల్స్ పెట్టిన విజయ్ దేవరకొండ..

Vijay Deverakonda Fans Rules

Vijay Deverakonda Fans Rules

వరుస విజయాలతో సినిమాల జైత్రయాత్ర చేస్తున్న హీరో విజయ్ దేవరకొండ,తన అభిమానుల కోసం మాత్రం కొన్ని రూల్స్ పెట్టాను అంటూ భావోద్వేగపరమైన ఒక పోస్టు పెట్టారు..

అభిమానులని రౌడీస్ అంటూ ప్రేమగా సంభోదించే విజయ్ “మన సంఖ్యా పెరుగుతుంది,కాబట్టి మనకి మనమే కొన్ని నిబంధనలు ఏర్పరుచుకొవాల్సిన అవసరం ఏర్పడింది.. మనం యువకులం,మీరు నేనూ కూడా ఇది చేయగలం” అంటూ ప్రారంభించారు..

మనం మార్పుని కలిగిస్తున్నాం,అది సినిమాలలో కావొచ్చు,జీవన విధానం లో కావొచ్చు,అది మన రౌడీ కల్చర్ ,లేదా మన సొంత స్వభావం గానే ఉండనిద్దాం..సోషల్ మీడియా లో పోజిటివిటీ ని ట్రెండ్ చేయడానికి సమయం ఆసన్నమైంది..


మీలో చాలా మంది నా ఫోటోలను సోషల్ మీడియా లో పెట్టుకుంటున్నారు,అయితే మీరు ఇతర అభిమానులతో గొడవలకి దిగుతున్నారు..నేనైతే అలా చేయను. మీరు కూడా చేయొద్దు. అది కష్టం అని నాకు తెల్సు,అయితే నేను ఇప్పుడున్న స్థానం నేను నా జీవితం లో కష్టపడడం వల్లే వచ్చింది,వేరే వాళ్ళ గురించి పట్టించుకోలేదు.. బ్రతుకుదాం,బ్రతకనిద్దాం.. అన్నారు విజయ్..

ఒక వేళ మీరు ఎవరినైనా ద్వేషించినా కూడా ,మీరు వారు బాగుండాలి అని కోరుకోండి,సంతోషంగా ఉంది.. మీరు బాధపడటానికి ఏమీ లేదు.. నా తరఫునుంచి మీకు మంచి సినిమాలు ,మంచి బట్టలు ఇలా ఇస్తూనే ఉంటా.. దయచేసి సోషల్ మీడియా లో ఎవర్నీ తిట్టకండి — ప్రేమించండి సంతోషం గా ఉండండి, మీ దేవరకొండ.. ” అంటూ ముగించారు విజయ్..
ఈమధ్య కాలంలో సోషల్ మీడియా లో అభిమానుల యుద్ధాలు శృతి మించుతున్న సంగతి తెల్సిందే..నిజానికి హీరోలు అందరూ మంచి స్నేహితులు గానే ఉన్నా,అభిమానుల చేసే ఇటువంటి వాదోపవాదాలు వారికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి.. ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులకి ఇటువంటి సందేశం పంపడం నిజంగా చాలా మంచి విషయం..

ఇక విజయ్ దేవరకొండ తాజా చిత్రం నోటా ఈ నెల 5 న విడుదల కానుంది.. ఈ చిత్రం ద్వారా తమిళంలో కూడా అడుగుపెట్టబోతున్నారు విజయ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed