వీడియో : విజయ్ దేవరకొండ రూటే సెపెరేటు,నిజజీవితంలో అభిమానులను కారు లో ఎక్కించుకుని రైడ్ ఇచ్చిన టాక్సీవాలా ..

Vijay Deverakonda Fans Ride

Vijay Deverakonda Fans Ride

వరుస విజయాలతో దూసుకుపోతున్నా కూడా సక్సెస్ ని ఏ మాత్రం తలకెక్కించుకొని అతి తక్కువ యువ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.. తన అభిమానులని ముద్దుగా రౌడీస్ అని సంభోదించే విజయ్,తాజాగా వారి కోసం టాక్సీ వాలా అవతారం ఎత్తారు.. అంటే అది విజయ్ ఈమధ్యన విడుదలైన సినిమా కాదండోయ్,నిజ జీవితంలో తన అభిమాన రౌడీల ను కారు లో ఎక్కించుకుని మరీ వారి గమ్యస్థానాల్లో దింపడం అన్న మాట..

కొద్దిరోజుల క్రితం విజయ్ ఈ విషయమై ఒక పోస్ట్ పెట్టారు,తనకు టాక్సీవాలా అవ్వడం అనేది చిన్నప్పటి కల అని,తన అభిమానులు ఎవరైనా తనతో పాటు కారు లో ప్రయాణిస్తే వారిని గమ్యస్థానంలో దింపడానికి తాను సిద్ధం అంటూ అయన పోస్ట్ పెట్టారు..


ఈ ట్వీట్ కు విశేష స్పందన లభించగా,ట్వీట్ చేసిన అభిమానుల్లో కొందరిని రాండమ్ గా ఎంపిక చేసిన వారిని గమ్యస్థానంలో దింపాడమే కాకుండా ,వారితో ముచ్చటించిన వీడియో కూడా షేర్ చేసారు విజయ్..

మొత్తం 6 గురు ఫాన్స్ ని విజయ్ ఇందుకోసం ఎంచుకోగా,ఒక మహిళా జర్నలిస్ట్ ,ఒక పోలీస్ అధికారిని ,ఒక గాయని,ఇంకో ముగ్గురు పురుష మిత్ర బృందం కూడా విజయ్ తో గమ్యస్థానానికి ప్రయాణించారు.. మంచిరేవుల లో ప్రారంభమైన విజయ్ రైడ్ తన రౌడీ ఫ్యాన్ ని గుచ్చి బౌలీ లో దింపడంతో ముగిసింది.. ఏది ఏమైనా విజయ్ తన అభిమానులకి ఇచ్చే ట్రీట్మెంట్ సూపర్ అంటున్నారు ఇప్పుడు టాలీవుడ్ జనాలు..

విజయ్ తాజాగా భరత్ కమ్మ దర్శకత్వంలో వస్తున్నా డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *