క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కి ప్రమాదం,షూటింగ్ లో ట్రైన్ ఎక్కుతూ జారిపడిన విజయ్.. వివరాలు..

Vijay Deverakonda Accident

Vijay Deverakonda Accident

క్రేజీ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కి తృటిలో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తుంది.. ఒక షూటింగ్ లో ఆయన ట్రైన్ ఎక్కే సన్నివేశాలని చిత్రీకరిస్తున్న సమయంలో అయన ట్రైన్ ఎక్కబోతూ జారిపడినట్లు సమాచారం..

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అయింది,విజయ్ దేవరకొండ హీరోగా నిర్మితమవుతున్న డియర్ కామ్రేడ్ షూటింగ్ ప్రస్తుతం కాకినాడ లో జరుగుతుంది.. ఇందు కోసం విజయ్ ట్రైన్ ఎక్కే సన్నివేశాన్ని స్థానిక టౌన్ రైల్వే స్టేషన్ లో చిత్రీకరిస్తుండగా విజయ్ జారిపడ్డారు..

విజయ్ దేవరకొండ కాలు జారి క్రింద పడినట్లు తెలుస్తుంది,అయితే ప్రక్కనే ఉన్న షూటింగ్ సభ్యులు వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది,ప్రమాదం జరిగిన సమయంలో ప్రక్కనే మరొక ట్రైన్ కూడా రన్నింగ్ లో ఉంది,దీనితో విజయ్ కి భారీ ముప్పే తప్పింది అంటున్నారు..

ఈ ప్రమాదంలో విజయ్ కి స్వల్ప గాయాలు అయ్యాయి.. తనకు తగిలిన గాయాలను సోషల్ మీడియా లో అభిమానులతో పంచుకున్నారు విజయ్.. విజయాలు ఊరికే రాబోవు అంటూ,తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాను అంటూ విజయ్ ఒక సందేశాన్ని ఉంచారు..

భరత్ కమ్మ దర్శకత్వంలో వస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో రష్మిక మందన కథానాయికగా నటిస్తున్నారు.. ఈచిత్రంలో విజయ్ కాకినాడ కు చెందిన యువకుడి పాత్రలో మెరవబోతున్నారట..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed