ముఖ్యమంత్రి చంద్రబాబు చదివిన తిరుపతి పాఠశాలలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజకీయం చేసే ప్రయత్నం,ప్లాన్ ఫెయిల్ అయ్యి బయటకి వచ్చేసిన మంత్రివర్యుడు.

Central HRD Minister Prakash Javadekar Faced an Embarassing Moment,when he tried to inspect a school studied by AP CM Chandrababu in Tirupati..

Prakash Javadekar Chandrababu School

కేంద్రంలో భాజపా కి ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ టీడీపీ కి ఉప్పు నిప్పు మాదిరి సంబంధాలు నడుస్తున్న సంగతి తెల్సిందే.. అయితే అందుకే చేయాలి అనుకున్నారో మరి ఎందుకు చేసారో తెలియదు కానీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చదువుకున్న పాఠశాల ను ఇన్స్పెక్షన్ చేయాలి అనే సరదా పుట్టింది..

అయితే ఆయన ఊహించింది ఒకటి అయితే అనుకున్నది ఇంకొకటి.. ఎదో రాజకీయ విమర్శలు చేద్దాం అనే ఆలోచన ఉన్న మంత్రి గారికి స్కూల్ లో వాతావరణం పూర్తిగా షాక్ ఇచ్చింది..6-10 తరగతులు ఉన్న ఉన్నత పాఠశాల అది,అక్కడ మొత్తం డిజిటల్ తరగతులు నడుస్తున్నాయి..


ఇది మీ ముఖ్యమంత్రి చదువుకున్న పాఠశాల అని మీడియా కి చూపించే ప్రయత్నం చేసారు జవదేకర్,అక్కడ ఆయనకి డిజిటల్ తరగతులు స్వగతం పలికాయి.. బడి రిజిస్టర్ పరిశీలించిన జవదేకర్ హాజరు శాతం బాగానే ఉన్నట్లు తెల్సుకున్నారు..

అక్కడ డిజిటల్ తరగతుల్లో విద్యార్ధులకి అందుతున్న డిజిటల్ తరగతులు చూసి ఆశ్చర్యపోయారు జవదేకర్.. పిల్లలను డిజిటల్ తరగతుల గురించి ప్రశ్నలు అడిగి వారి సమాధానాల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేసారు.. విశాలమైన తరగతులు,గ్రంధాలయం,సరైన సమయానికి మధ్యాహ్న భోజనం ఈ సౌకర్యాల గురించి తెల్సుకుని చేసేది ఏమీ లేక,పాఠశాలలో విద్యార్థులు 150 మంది మాత్రమే ఉన్నారు అంటూ మీడియా తో మాట్లాడి జవదేకర్ చల్లగా అక్కడి నుంచి జారుకున్నారు..

తిరుపతి లో ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాల చంద్రబాబు అక్కడ 1967-68 బ్యాచ్ లో SSLC చదివారు.. ఏది ఏమైనా రాజకీయాలు పాఠశాలల్లో కి కూడా తీసుకొచ్చే ప్రయత్నం కొంచెం టూ మచ్ గా లేదూ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed