వీడియో : స్వర్గం నుంచి అన్న గారు భూమి మీదకి షికారు వచ్చారా?తెలంగాణ టీడీపీ నేతలతో ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య మంతనాలు..వీడియో వైరల్..

NTR Biopic Leaked Pic

ఎన్టీఆర్ – ఈ పేరు తెలుగు సినీ,రాజకీయ రంగాలలో ఒక సంచలనం.. అయన భువికేగి 22 సంవత్సరాలు దాటుతున్నా,ఇప్పటికీ ఆ పేరు చెప్తే చాలు ప్రతి తెలుగు వాడి ఆత్మగౌరవం ఉవ్వెత్తున ఉప్పొంగుతుంది.అలాంటి అన్నగారి జీవిత చరిత్రను అయన కుమారుడు నందమూరి బాలకృష్ణ బయో పిక్ గా రూపొందిస్తున్న సంగతి తెల్సిందే..

కథానాయకుడు,మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ ప్రస్థానాన్ని,రెండవ భాగంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానాన్ని చూపించనున్నారు.. ఇక తాజాగా ఎన్టీఆర్ రాజకీయ నాయకుడి పాత్ర ఫోటోలు, వీడియో లు బయటకి వచ్చేసాయి..

తెలంగాణ టీడీపీ నాయకులు ,ఈరోజు బాలయ్య ని ఎన్టీఆర్ మహానాయకుడు షూటింగ్ లో కలిసారు.. కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో బాలకృష్ణ ప్రచారానికి మంచి స్పందన వచ్చిందని,ఈ సందర్భంగా కృతజ్ఞత తెలిపేటందుకే హిందూపూరం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను కలిశామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్‌.రమణ, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్‌ బయోపిక్‌ షూటింగ్‌లో పార్టీ జెండా ఆవిష్కరణ సమయంలో,బాలయ్యను కలవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఇక ఈ నాయకులతో బాలయ్య మాట్లాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.. “ఆ మహానుభావుడి కుమారుడిగా జన్మించడం,తన పుణ్యఫలం” అంటూ బాలయ్య ఈ సందర్భంగా వారితో తెలిపారు..

అయితే తెల్లటి పంచె కొట్టు,అచ్చు గుద్దినట్లు ఎన్టీఆర్ ముఖ వర్చస్సు,ఆ ఆహార్యం అచ్చం పెద్దాయన ఎన్టీఆర్ ని గుర్తు చేసింది అని తలుచుకుంటూ బాలయ్య అభిమానులు మురిసిపోతున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *