కేటీఆర్ గారూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నా మిత్రుడు చనిపోయాడు,పట్టించుకోండి..ఆవేదనతో పోస్ట్ పెట్టిన మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్

Nag Ashwin Comments KTR

Nag Ashwin Comments KTR

ఎప్పుడూ కూల్ గా ఒక మునిలా నిశ్శబ్దంగా ఉండే మహానటి సినిమా ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ సోషల్ మీడియా లో తెలంగాణా ఐటీ మంత్రి కేటీఆర్ ని ఉద్దేశిస్తూ తన మిత్రుని మరణం పై ఆవేదనాభరితమైన పోస్టుని ఉంచారు..

గత ఆదివారం తన మిత్రుడు ,మంచి కెమెరా మ్యాన్ అయిన ఒక వ్యక్తికి ఆక్సిడెంట్ అయిందని,అప్పుడు తన మిత్రుడి తల్లిదండ్రులు గాంధీ హాస్పిటల్ కి తరలించగా,అక్కడ వైద్య సదుపాయం సరిగ్గా అందాకా తన మిత్రుడు మృతి చెందాడు అని,వేరే ఏ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లినా అయన బ్రతికేవాడు అంటూ పోస్ట్ చేసారు అశ్విన్..

‘ఆదివారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన నా స్నేహితుడు చనిపోయాడు. అతనికి ప్రమాదం జరిగినప్పుడు చికిత్స నిమత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత మూడు గంటల పాటు అతను చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాడు. ఆ రోజు ఆదివారం కావడంతో ఎవరూ అందుబాటులో లేరు. అతని తల్లిదండ్రులే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి మోసుకుంటూ తిరిగారు. ఆ సమయంలో గాంధీ ఆస్పత్రిలో కాకుండా మరేదన్నా ఆస్పత్రికి తీసుకెళ్లినా నా స్నేహితుడు బతికేవాడు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వాస్పత్రికి తరలించి మనుషులు ప్రాణాలు ఎందుకు కాపాడుకోలేం? ప్రభుత్వాస్పత్రి అంటే చావుకు, నిర్లక్ష్యానికి పర్యాయపదం కాదు అని చెప్పడానికి ఏం చేయమంటారో చెప్పండి కేటీఆర్‌ సర్‌. వైద్యం అందక చనిపోయిన నా స్నేహితుడు ఈ రాష్ట్రంలోనే గొప్ప కెమెరామెన్‌. దీని గురించి నాకు ఎవర్ని ప్రశ్నించాలో అర్థంకావడంలేదు సర్‌. అనవసరంగా అలా వైద్యం అందక ఎవ్వరూ చనిపోకూడదు’ అంటూ పోస్టులో పేర్కొన్నారు అశ్విన్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may missed